ఈ పండ్లను కలిపి తినకూడదట! 

రోజు పండ్లు తినడం ఆరోగ్యకరమైన అలవాటు. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే నిత్యం మన ఆహారంలో తప్పకుండా పండ్లు ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ఏదైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు తాజా పండ్లను తినాలని చెప్తుండటం మనం చూస్తుంటాం. కారణం పండ్లలో లభించే ఖనిజాలు, విటమిన్లే. ముఖ్యంగా కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మన ఆహారంలో పండ్లు, గుడ్లు వంటివి భాగం చేసుకోవడం అనివార్యమైంది.
  • ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడే అంతా సక్రమంగా ఉంటుంది. అలా కాదని ఎలా పడితే అలా ఉంటానంటే తేడా వస్తుంది. ఆహారం విషయంలోనూ అలాగే జరుగుతుంది. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందే. ముఖ్యంగా ఏ ఆహారంతో కలిపి ఏది తీసుకోవాలి… ఏ ఆహారంతో కలిపి ఏది తీసుకోకూడదు అనే విషయంపై క్లారిటీ ఉండాలి. ఇంట్లో ఉన్నాయి కదా అని ఓ పండును ఇంకో దానితో కలిపి తినకూడదట.
  • కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదంకరం అని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా కలిపడం వల్ల అవి విషంగా మారే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఏఏ పండ్లను కలిపి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
  • అరటి పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ అరటి పండును జామ కాయతో కలిపి తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు వస్తాయంట. అంతేకాదు తలనొప్పి కూడా పెరిగే అవకాశం ఉందట.
  • నారింజ- పాలు రెండూ కలిసి తిన్నప్పుడు, జీర్ణం కావడం మరియు వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే నారింజ పండ్లలోని ఆమ్లం జీర్ణక్రియకు కారణమయ్యే ఎంజైమ్‌లను నాశనం చేస్తుంది మరియు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. బహుశా మీరు చెర్రీస్ మరియు ఆరెంజ్ జ్యూస్ టంబ్లర్‌ను పాలతో కలిపి తాగడం గురించి ఆలోచిస్తే, అజీర్ణ సమస్య ప్రమాదాన్ని పెంచుతున్నారని అర్థం.
  • బొప్పాయి పండు, నిమ్మకాయలను కలిపి తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ హెచ్చు తగ్గులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. ఇలా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తలెత్తవచ్చు.
  • ఆరెంజ్, క్యారెట్ కలిపి తినడం వల్ల మూత్రపిండ సంబంధ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆరెంజ్, క్యారెట్ కలిపి తినడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయంటున్నారు.
  • దానిమ్మ, నేరేడు పండ్లు కూడా కలిపి తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు. ఈ రెండింటిలో చక్కెర, ప్రోటీన్లు అధికంగా ఉండి, కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. వీటిలోని అధిక చక్కెర ప్రోటీన్లు జీర్ణం చేసే ఎంజైమ్లను నశింజేస్తాయట. అలాగే, అరటిపండుతో పాయసం కలిపి తినడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెప్తున్నారు. పాలు, నిమ్మకాయ వంటివి తీసుకోకుడదు. అలా తీసుకంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
  • పైనాపిల్‌లో బ్రోమిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది పాలతో కలిపినప్పుడు, శరీరంలో అపానవాయువు, వికారం, ఇన్ఫెక్షన్లు, తలనొప్పి, కడుపు నొప్పి వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. అలాగే పండ్లు, కూరగాయలు ఎప్పుడూ కలిపి తినకూడదు. పండ్లలో చక్కెర అధికంగా ఉంటుంది. అవి జీర్ణం కావడం చాలా కష్టం. ఈ పండు కడుపులో ఎక్కువసేపు ఉంటే, అది పులియబెట్టి, విరేచనాలు, తలనొప్పి,  కడుపునొప్పికి కారణమయ్యే  అవకాశం ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR