మనం సరిగా గమనిస్తే కొంతమంది రోజూ బయట ఏదో ఒకటి తింటూ ఉంటారు. వాటికి అలవాటు పడిపోయి ఉంటారు. ఎంతలా అంటే వాటిని మానాలనుకున్న మానలేరు. ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎంత మానేయాలని చూసా మానలేరు. సిగరెట్, మందు కి అడిక్ట్ అయినట్టు చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడుతుంటారు.టైం తో పనిలేకుండా బర్గర్ లు, పిజ్జా లు, బేకారి ఐటమ్స్ లాగించేస్తూ ఉంటారు. ఇక కొంతమంది కడుపు నిండుగా తిన్నా తీపి, ఉప్పు, పుల్లపుల్లటి ఆహార పదార్థాలను చూడగానే మళ్లీ తినాలన్న కోరిక కలుగుతుంది. వీటినే ఫుడ్ క్రేవింగ్స్ (ఆహార కోరికలు) అంటారు.
ముఖ్యంగా గర్భిణులకు ఇవి ఎక్కువగా కలుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తమ జిహ్వ చాపల్యాన్ని తీర్చుకోవడానికి పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఐస్‌క్రీమ్స్ వంటి జంక్ ఫుడ్స్‌ను ఆశ్రయిస్తారు. సాధారణంగా గర్భం ధరించిన మహిళలకు ఈ ఆహార కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి. అదేవిధంగా మూడ్ స్వింగ్స్, పని ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం కూడా ఈ ఫుడ్ క్రేవింగ్స్‌కు కారణమవుతాయి. ఇలాంటి సమయాల్లో జంక్‌ఫుడ్స్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల శాతం పెరుగుతుంది. ఊబకాయం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
చాలామంది ఈ అలవాటు మానాలనుకున్నా మానలేకపోవడానికి వెనుక ఒక సైంటిఫిక్ రీసన్ ఉంది. సహజంగా తల్లిపాలల్లో కార్బొహైడేట్లు, కొవ్వు పదార్థాలు అధికస్థాయిలో ఉంటాయి.అదే మోతాదులో బంగాళాదుంపలు, తృణధాన్యాల్లో ఉండటం వల్ల వాటితో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, కేండీ బార్ వంటివి ఎక్కువగా తింటున్నట్లు చెబుతున్నారు.ఈ కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మెదడు వ్యవస్థను తీవ్రంగా ప్రభావితంగా చేస్తాయంటున్నారు. ఈ అలవాట్లను అదుపులో ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు.
జంక్ ఫుడ్ టేస్టీగా వున్న ఇది ఆరోగ్యానికి మాత్రం అంత మంచిది కాదు. ఇక చాలా మంది కూడా జంక్ ఫుడ్ కి చాలా అలవాటు పడిపోతుంటారు. ఇక ఈ అలవాటుని నివారించడానికి ముందుగా కడుపును ఖాళీ ఉండకుండా చూసుకోవాలి. కడుపు నిండినట్లుగా అనిపిస్తే అసలు ఆకలి అనిపించదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ల మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. అదేవిధంగా తక్కువ మోతాదులో తిన్నా ఇతర ఆహార పదార్థాలపై మనసు మళ్లుతుంది. అందుకే మధ్య మధ్యలో కాస్త బాదం, వాల్‌నట్స్, పండ్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకుంటూ ఉండాలి. దానివల్ల జంక్ ఫుడ్ ని తినకుండా ఉంటారు.
అలాగే పార్టీ లేదా డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఖచ్చితంగా హెల్తీ ఫుడ్‌నే తినాలి. అలా తినటం వలన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండొచ్చు. ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తే ముందుగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే వాటిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టండి. దానితోపాటు నీళ్లు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఆహార కోరికలు నియంత్రణలో ఉంటాయి. అదేవిధంగా శరీరం రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల ఆహార కోరికలు తగ్గిపోతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో చూయింగ్ గమ్ కూడా సమర్థంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు.
చాలామంది వివిధ పనుల్లో పడి భోజనం చేయడం మర్చిపోతుంటారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న పదార్థాలతో ఆకలిని తీర్చుకుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. సాధారణంగా ఎక్కువ సమయం ఆకలితో ఉన్నప్పుడు శరీరం అనారోగ్యకరమైన జంక్‌ఫుడ్స్‌నే కోరుకుంటుంది. ఆహార కోరికలను అదుపులో ఉంచుకోవాలంటే జంక్‌ఫుడ్స్‌ను దూరంగా ఉంచాల్సిందే. ఇంట్లో చిప్స్, నామ్‌కీన్స్, కుకీస్, ఐస్‌క్రీమ్స్ వంటివి స్టోర్ చేసుకోవడానికి బదులు బాదం, వాల్‌నట్స్.. మొదలైనవి ఎక్కువగా నిల్వ ఉంచుకోవాలి.
భావోద్వేగాలు నియంత్రించుకోలేని వారు తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. సాధారణ సమయాల్లో కంటే ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఎక్కువగా తింటుంటారు. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా, మెడిటేషన్‌ను జీవనశైలిలో భాగం చేసుకోండి. రాత్రి పూట తగిన నిద్రపోయే వారికి ఆహార కోరికలు తక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారు తీపి, ఉప్పు, కారం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి తక్కువగా ఆసక్తి చూపుతారంటున్నారు. అందుకే రాత్రి పూట కంటి నిండా నిద్రపోండి.
అలాగే ఆల్కహాల్ తాగేవారు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడుతుంటారు. కానీ ఆల్కహాల్ కష్టాన్నంతా కూడా వృథా చేసేస్తుంది. మద్యానికి బదులుగా నీళ్లు లేదా రుచికరమైన జ్యూస్ ఇంకా నిమ్మరసం లాంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.అందువల్ల మద్యం అలవాటును క్రమ క్రమంగా శాశ్వతంగా కంట్రోల్ చేయొచ్చు. దానికి బదులుగా ఎక్కువగా సలాడ్ తినండి. చాలా మంచిది. సలాడ్ తినడం ద్వారా త్వరగా కడుపు నిండినట్లు అనిపించడంతో వెంటనే జంక్ ఫుడ్‌కు దూరమవుతారు.