నోటి దుర్వాసన అనేది వినడానికి చిన్న సమస్యలా కనిపించినా చాలా ఇబ్బందికరమైన సమస్య. చాలా సందర్భాల్లో నోరు పరిశుభ్రంగా లేకపోతే దుర్వాసన వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే ఇది కొన్ని తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతమని నిపుణులు తెలియచేస్తున్నారు. నోటి శుభ్రత లేకపోతే,బ్యాక్టీరియా వేగంగా పెరిగి నోరు వాసన వచ్చేలా చేస్తుంది.నోటిలో వాసన వస్తే అది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆహారం తిన్న తర్వాత, నీటితో పుక్కిలించకపోతే చిన్న చిన్న తునకలు లాంటి ఆహారపు ముక్కలు దంతాలలో ఉండి, నోటిలో కొన్ని గంటల తర్వాత దుర్వాసన కలిగిస్తాయి. అంతే కాకుండా, పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు కూడా చాలాసేపు నోటి నుంచి అటువంటి వాసన వస్తుంది. దంతాల పరిశుభ్రత గురించి సరిగా పట్టించుకోకపోతే ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. సరిగా పళ్లు తోమనప్పుడు దంతాలలో చిక్కుకున్న ఆహార ముక్కలు పళ్ల వెనుక ఉండి పాచిలా మారవచ్చు.
నోటిలోని బ్యాక్టీరియా ఆ ముక్కలను జీర్ణించుకుని హైడ్రోజన్ సల్ఫైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దుర్వాసన గల వాయువు. ఆపై పళ్లపై పచ్చటి పాచి పేరుకుంటుంది. చిగుళ్లలో శోథ కలిగి వాసన రావచ్చు. అలా అని నోటి దుర్వాసనను లైట్ గా తీసుకోకూడదు. ఎందుకంటే నిపుణల ప్రకారం నోటి దుర్వాసన అనేది ఒక్కోసారి పలు రోగాలకు కారణం అవ్వవచ్చు. మీరు కూడా నోటి దుర్వాసన వల్ల ఇబ్బంవది పడుతోంటే వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి.
నోటి దుర్వాసనకు నోటి ఇన్ఫెక్షన్స్ కూడా ప్రధాన కారణం. లాలాజలం నోటిలో తేమను కాపాడుతూ, నోరు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ కొన్నిసార్లు, నోటిలో లాలాజల ఉత్పత్తి తగ్గడం వల్ల, మృతకణాలు నాలుక, చిగుళ్లు, బుగ్గల కింద పేరుకుని దుర్వాసన కలిగిస్తాయి. ఈ సమస్య సాధారణంగా నిద్రలో వస్తుంది. దీంతో పాటు పాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నోరు ఎండిపోవడం వల్ల ఇలా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం కోసం ఫాస్ట్ ఫుడ్ ను దూరంగా పెట్టడం మంచిది. దీని వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. దీని వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం కూడా ఉంది. జీర్ణక్రియపై కూడా ప్రభావం కలుగుతుంది. అందుకే ప్రతీ రోజు కావాల్సినంత నీరు తీసుకోండి.
స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. దాంతో పాటు స్మోకింగ్ చేయడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది. స్మోకింగ్ నోటిని ఎండిపోయేలా చేస్తుంది. ఇలా నోటి దుర్వాసన వల్లే దాని వల్ల సైనస్, నోటి, గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాధులు కూడా కలిగే అవకాశం కూడా ఉంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నోటి దుర్వాసన రావచ్చు. జీర్ణ సమస్యలు, క్యాన్సర్, శరీరంలోని ఇతర జీవక్రియల్లో అవాంతరాలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. డైటింగ్, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, నోటి పూత, చిగుళ్లలో రక్తస్రావం, నోటిలో పుండ్లు, గవద బిళ్లలు, శరీరంలో జింక్ తగ్గడం వంటివి కూడా నోటి దుర్వాసనకు దారితీస్తాయి. ఈ సమస్య అలాగే కొనసాగుతుంటే, వైద్యుడిని సంప్రదించాలి.
డయాబెటిస్ ప్రారంభ అవుతుంది అనేది కూడా నోటి వాసన ద్వారా గుర్తించవచ్చు అని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఎవరికైనా షుగర్ ఉంటే కచ్చితంగా నోరు వాసన వస్తుంది. నోటిలో తరచుగా వాసన వస్తుంది అని అనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. మూత్ర పిండాల వ్యాధులు ఉన్నాకూడా నోటిలో వాసన వస్తుందని వైద్యులు తెలియచేస్తున్నారు. మూత్ర పిండాల వ్యాధులు ఉన్న వారికి రక్త ప్రవాహంలో యూరియా పెరిగి దీనివల్ల నోరు దుర్వాసన వస్తుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాల యూరియాను నిరోధిస్తాయి. ఇది సాధ్యం కానప్పుడు, అది నోరు దుర్వాసన వచ్చేలా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధి కారణంగా, శరీరంలో జీవక్రియ మార్పులు జరుగుతాయి. కాలేయం శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోతే, రక్తప్రవాహంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. దీనివల్ల నోటిలో దుర్వాసన వస్తుంది.