పళ్ళు తెల్లగా ఉండాలంటే సహజసిద్ధమైన ఈ చిట్కాలు తప్పనిసరి ?

మన దంత ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ఆరోగ్యకరమైన, తెలుపు దంతాలు అవసరం. దంతాలు పసుపుగా మరియు కాంతిహీనంగా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని ఆహారాలు మీ దంతాల యొక్క పై పొర అయిన ఎనామెల్‌ను పాడుచేస్తాయి. అంతేకాక, మీ దంతాలపై ప్లాక్యూ ఏర్పడటం వలన అవి పసుపు రంగులో కనిపిస్తాయి. సాధారణంగా ఈ రకమైన రంగు మారడాన్ని రెగ్యులర్ క్లీనింగ్ మరియు వైటెనింగ్ లతో చికిత్స చేయొచ్చు. అయినప్పటికీ, కొన్నిసార్లు దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి ఎందుకంటే హార్డ్ ఎనామెల్ క్షీణించి, దాని కింద ఉన్న డెంటిన్‌ బయటపడుతుంది. డెంటిన్ సహజంగా పసుపు, అస్థి కణజాలం. ఇది ఎనామెల్ కింద ఉంటుంది. మీరు పళ్ళు తెల్లగా ఉండాలంటే, కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను వాడటం మానేసి సహజసిద్ధమైన మరియు సురక్షితమైన ఈ చిట్కాలను పాటించండి. అయితే, ఫలితం రావాలంటే రెగ్యులర్ గా వీటిని చేస్తూ సహనంతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Teeth whitenకాఫీ, సోడా మరియు కొన్ని సార్లు మౌత్ వాష్ లు కూడా మీ దంతాలు పసుపు వర్ణానికి దారితీస్తాయి. అందువల్ల మనం వాటికి దూరంగా ఉండాలి.

రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయాలి:

Teeth whitenఒక రోజుకు కనీసం రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చాలా అవసరం . అందువల్ల మీ దంతాలలో మరియు నాలుక మీద ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా సహాయపడుతుంది . అందువల్ల, ఎల్లో మరకలు నివారించాలంటే, రోజుకు రెండు సార్లు బ్రెష్ చేయడం తప్పనిసరి.

పండ్లు తినాలి:

Teeth whitenకొన్ని సార్లు మీరు తొందరలో ఉన్నప్పుడు సరిగా బ్రష్ చేయరు. అటువంటప్పుడు మీరు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మీ దంతాలు నేచులర్ గా శుభ్రపడుతాయి. అలాగే సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల మీద ఎటువంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి. అందుకు అవసరం అయ్యే సలివాను ఇవి ఉత్పత్తి చేస్తాయి. ఇది మీ దంతాలు శుభ్రపరచడానికి మరియు దంతాలను తెల్లగా మార్చడానికి సహయపడుతాయి. మరియు పండ్లలో విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ, కివి మీ దంతాలను బలోపేతం చేస్తాయి. ఆపిల్ మరియు పియర్స్ వంటివి చాలా ఉపయోగకరమైనవి, వీటిలో అధికంగా నీరు ఉంటుంది . ఇది లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఫ్లాసింగ్ :

Teeth whitenఫ్లాసింగ్ చేయడం వల్ల చిగుళ్ళ నుండి అధిక రక్తస్రావం జరుగుతుందని చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ జాగ్రత్తగా మరియు ఓపికగా చేయడం వల్ల మీ దంత ఆరోగ్యాన్ని నిర్వహించడానికి మరియు మీ పళ్ళ మీద ఎటువంటి మరకలు లేకుండా నివారించడానికి సహాయపడుతుంది.

పాల ఉత్పత్తులు:

Teeth whitenజున్ను మరియు పెరుగు పాల ఉత్పత్తులు దంతక్షయ వ్యాధి తగ్గిస్తాయి మరియు దంతాల యొక్క స్వచ్ఛత మరియు అభివృద్ధికి సహాయపడుతుంది . ఎనామిల్ కి రక్షణ కల్పించడంలో మరియు బలోపేతం చేయడంలో హార్డ్ చీజ్ అంటే మృదువైన జున్నులు పళ్ళను శుధ్దిచేసి, అత్యంత సమర్థవంతంగా మరియు తెల్లగా మార్చుతాయి.

నువ్వు గింజలు:

Teeth whitenనువ్వులు నాలుక మీద బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది మరియు ఇది పళ్లఎనామిల్ నిర్మాణానికి సహాయపడుతుంది. వీటిలో కూడా క్యాల్షియం అధికంగా ఉంటుంది, ఇది మీ దంతాల చుట్టూ ఉన్న ఎముకల రక్షణకు సహాయపడుతుంది .

పొద్దుతిరుగుడు :

Teeth whitenపొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్స్ మరియు విటమిన్ ఇ వంటివి మంచి మూలంగా ఉంటాయి. ఇవి ఇంకా ముఖ్యమైన మినిరల్స్ అంటే మెగ్నీషియన్ ను అందిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు నమలడం వల్ల చెడు శ్వాసను నివారిస్తుంది మరియు దంతాల మీద ఎటువంటి మరకలు పడకుండా రక్షణ కల్పిస్తుంది.

స్ట్రాను ఉపయోగించండి:

Teeth whitenస్ట్రాను ఉపయోగించడం వల్ల మీ దంతాల మీద మరకలు పండకుండా నిరోధించవచ్చు. ఏదైనా కలర్ డ్రింక్ త్రాగుతున్నప్పుడు , దంతాల మీద మరకలు పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. స్ట్రాలను ఉపయోగించడం వల్ల దంతాలకు తగలకుండా నోట్లోకి పోవడం వల్ల దంతాల మీద మరకలు ఏర్పడటానికి అవకావం ఉండదు.

వెజిటేబుల్స్:

Teeth whitenగ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బ్రోకోలీ, క్యారెట్, గుమ్మడి వంటి వాటిలో విటమిన్ కె సమృద్ధిగా ఉంది, ఇది పళ్ళు ఎనామెల్ యొక్క నిర్మాణంకు సహాయపడుతుంది. కాబట్టి, ఈ కూరగాయలరు పచ్చిగా తినడం వల్ల పళ్ల మద్య సహజంగానే మాసాజ్ చేస్తాయి దాంతో పళ్ళ మద్య శుభ్రం అవుతుంది. ఇంకా దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

నిమ్మ, ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించండి :

Teeth whitenనిమ్మ సహజంగా సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది, ఈ సిట్రిక్ యాసిడ్ కు ఉప్పు చేర్చడం వల్ల ఈ రెండింటి మిశ్రం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి. మీ దంతాలు తెల్లగా మారాలంటే ఈ రెండింటి మిశ్రమంతో అప్పుడప్పుడు బ్రష్ చేయాలి.

ప్రతి రెండు నెలల కొకసారి కొత్త బ్రష్ ఉపయోగించండి :

Teeth whitenఉత్తమ ఫలితాలు పొందడం కోసం రెగ్యులర్ ఇంటర్వెల్స్(తరచూ)రెండు నెలకొకసారి టూత్ బ్రష్ ను మార్చుతుండాలి. ఒక నిర్ణీత కాలం తర్వాత టూత్ బ్రష్ యొక్క బ్రిస్టల్స్ చాలా కఠినంగా మారుతాయి. దాంతో మీ దంతాల యొక్క ఎనామిల్ ను పాడుచేస్తుంది. దాంతో మీ దంతాల మీద మరకలు ఏర్పడటానికి దారితీస్తుంది.

కాల్షియం :

Teeth whitenకాల్షియం తీసుకోవడం మెయింటైన్ చేయండి తగినంత క్యాల్షియంను మీరు తీసుకోవడం వల్ల మీ దంతాలను బలోపేతం చేస్తుంది మరియు దంతాల అమరిక నిలబెట్టడానికి సహాయపడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR