మనిషికి ఎంత తాగితే కిక్కు ఎక్కుతుందో తెలుసా?

0
335

సాధారణంగా ఒకటి, రెండు పెగ్గులు, అర గ్లాసు బీరు తాగినా తమపై పెద్దగా ప్రభావం ఉండదని చాలామంది భావిస్తారు. కానీ 75 కిలోల బరువు ఉండే ఒక వ్యక్తి సగం బీరు తాగినా… వాళ్ల కళ్లు, చేతులను సమన్వయం చేసుకునే శక్తి తగ్గిపోతుందని తాజా అధ్యయనం చెబుతోంది. ఎక్కువగా దృష్టి పెట్టి చేసే పనులైన డ్రైవింగ్, పైలటింగ్, పెద్ద పెద్ద మెషిన్లను, భారీ యంత్రాలను నడిపేవారు కొద్ది మొత్తంలో ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకున్నా, అది వారి సామర్థ్యంపై ప్రభావం చూపుతుందట.

Alcoholచట్టప్రకారం డ్రైవింగ్ చేసేవారు ఎంత వరకు ఆల్కహాల్ తీసుకోవచ్చనేది బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్‌ (BAC) ద్వారా నిర్ణయిస్తారు. కానీ ఇంతకన్నా తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా, అది డ్రైవింగ్ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆల్కహాల్ డ్రింక్స్ వల్ల కంటి, చేతి సమన్వయం గతంలో అనుకున్నదానికంటే మరింత సున్నితంగా ఉందని వారు కనుగొన్నారు.

Alcoholచాలా మంది ప్రజలు కొద్ది మొత్తంలో డ్రింక్స్ తీసుకున్న తర్వాత తాము బలహీనంగా లేమని భావిస్తారు. కానీ వారు అనుకునేదానికంటే చాలా ఎక్కువ ప్రభావం ఉంటుందని అంటున్నారు.

Alcoholపరిమితంగా మద్యం తీసుకున్నవారు బాగానే ఉన్నప్పటికీ, దాని ప్రభావం డ్రైవింగ్‌పై కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.

 

SHARE