ఆరోగ్యానికి మంచిదని బొప్పాయి ఎక్కువగా తింటున్నారా?

బొప్పాయి పండ్లు ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉంటాయి. సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంటూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. కొందరు బొప్పాయిని పండుగా తింటారు.. మరికొందరు పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. బొప్పాయిని మంచి ఔషధాల గనిగా చెప్పుకోవచ్చు. బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయిలో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకపదార్థాలు ఉంటాయి.
  • డెంగీ జ్వ‌రం వ‌చ్చిన వారి శ‌రీరంలో ప్లేట్‌లెట్ల‌ను పెంచేందుకు బొప్పాయి పండు, ఆకులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల శరీర బరువు తగ్గుతుంది, కొవ్వు పదార్థాల వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.
  • బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉండడం వలన శరీరంలో కి ప్రవేశించి క్యాన్సర్ కు కారకమయ్యే  హానికర క్రిములను తొలగించి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండుని తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. భోజనం తిన్నాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది తినడం వల్ల మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికట్టవచ్చు.
  • ఈ జ్యూస్ తాగడం వలన శ్వాస సంబంధిత వ్యాధులు, గొంతునొప్పి, ట్రాన్సిల్స్ వ్యాధి తగ్గుముఖం పడుతాయి. బొప్పాయి తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కంటి సమస్యలను తీరుస్తుంది. ఈ బొప్పాయి పండులో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వలన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకే ఈ బొప్పాయి గుజ్జును బ్యూటీ క్రీముల్లో ఎక్కువగా వాడుతారు.
  • అయితే ఈ బొప్పాయి పండుని తింటే కొంతమంది ఆరోగ్యానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బొప్పాయి అతిగా తింటే వేడి చేస్తుంది. దీనివలన ప్రెగ్నెన్సీ ఉన్నవారు తినకూడదని.. అలా తింటే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా బొప్పాయి తింటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే గర్భిణీ స్త్రీలు, బాలింతలు కొంత కాలం బొప్పాయిని తినకుండా ఉండడమే మంచిది.
  • రోగనిరోధక శక్తి పెరగడానికి విటమిన్ సీ అవసరమే.. అయితే ఎక్కువ విటమిన్ సీ తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇక మగవారు ఎక్కువగా బొప్పాయి తింటే.. సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ పండు రోజూ తినడం వలన కొంతమంది చర్మం రంగుమారుతుంది. కళ్ళు తెల్లగా అవుతాయి. చేతులు ఆకుపచ్చ గా మారే అవకాశం ఉంది.
  • ఈ పండు ఎక్కువగా తింటే ఇది అన్నవాహికను దెబ్బతీస్తుంది. హైబీపీ మందులు వాడే వారు ఎక్కువగా బొప్పాయిని తింటే, అది మీ రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బొప్పాయిని ఎక్కువగా తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకునేకంటే.. మితంగా వారానికి రెండు లేదా మూడు సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR