వేగంగా పరిగెత్తే కాలంతోపాటే మనుషులు పరిగెడుతున్నారు. ఎంత వేగంగా అంటే కాసేపు ప్రశాంతంగా భోజనం చేసే సమయం కూడా ఉండట్లేదు. వేగంగా తమ పనులు ముగించాలని పనులతో పాటు ఫుడ్ తీసుకోవడం కూడా వేగంగా తీసుకుంటున్నారు, అయితే భోజనం చేసే సమయంలో కూడా ఇలా వేగంగా ఫుడ్ తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు.
ఇలా చేయడం వల్ల ప్రమాదం ఉంటుందని, సరిగ్గా నమలకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. భోజనం, టిఫిన్ ఏది తిన్నా నెమ్మదిగా తినాలి… బాగా నమిలి తినాలి. సాధారణంగా తినేదానికంటే ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. నమల కుండా తింటే ఆహారం ఎక్కువగా వెళ్లిపోతుంది. వేగంగా ఎక్కువగా ఫుడ్ తింటారు.
సరిగ్గా నమలని కారణంగా జీర్ణ సమస్యలు వస్తాయి. పేగుల సమస్యలు కూడా వస్తాయి.. ఇక ఊబకాయం బాగా పెరుగుతుంది, షుగర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. ఎక్కిళ్ళు రావడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది.
తగినంత ఆహరం నిదానంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి