అశోకుడు కళింగయుద్ధం చేయడానికి కారణం ఏంటి?

ప్రపంచంలోని గొప్ప చక్రవర్తులలో ఒకరు అశోకుడు. మౌర్య సామ్రాజ్యానికి మూడవ రాజైన అశోకుడు మొదట్లో హింస వైపు అడుగులు వేసి అతి భయంకరంగా కళింగ రాజ్యం పైన దండెత్తి యుద్ధం చేసాడు. ఆ యుద్ధమే కళింగ యుద్ధం. ఈ యుద్ధంలో కళింగ రాజ్యంలోని కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా అంతమంది చనిపోవడానికి కారణం తానె అని చెలించిన అయన హింసను వదిలేసి, బౌద్ధమతాన్ని స్వీకరించి తన రాజ్యంలో యుద్ధం అనేది ఉండకూడదు ప్రజలు శాంతియుతంగా సుఖసంతోషాలతో ఉండాలని భావించాడు. అయితే ఆ కాలంలోనే యుద్ధంలో అత్యంత అధునాతనమైన ఆయుధాలను, టెక్నాలజీ ని ఉపయోగించేవారు. ఈ టెక్నాలజీ దుర్మార్గుల చేతికి చిక్కితే ప్రపంచం సర్వనాశనం అవుతుంది అని ఆలోచించిన అశోకుడు రెండు వేల సంవత్సరాల నుండి సంగ్రమించ బడిన విజ్ఞాన బండారాన్ని రచించడానికి 9 మంది వ్యక్తులను నియమించాడు. ఆ అజ్ఞాత వ్యక్తులనే The Nine Unknown Men Off Ashoka అని అంటారు. మరి అశోకుడు కళింగయుద్ధం చేయడానికి కారణం ఏంటి? అతడు అహింస, బౌద్ధమతం వైపు ఎందుకు అడుగులు వేసాడు? రహస్యంగా నియమించిన ఆ తొమ్మిది మందికి ఎవరికీ ఏ విభాగాన్ని అప్పగించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 Rahasyavaani 283అశోకుడి తల్లి పేరు సుభద్ర, తండ్రి పేరు బిందుసారుడు. అయితే బిందుసారుడి తల్లి మరణించిన తరువాత సంతాప దినాలు ముగిసిన తరువాత పుట్టిన బిడ్డకి అశోకుడు అని పేరు పెట్టారు. అశోకుడు అంటే శోకించలేని వాడు అని అర్ధం. బిందుసారుని అనంతరం అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి ప్రభువైనాడు. అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి మూడవ రాజుగా పట్టాభిషేకుడైన తరువాత కళింగ రాజ్యం పైన దండెత్తాలని భావించాడు. ఆ యుద్ధంకోసం సరైన సమయం కోసం చుసిన అశోకుడు అప్పటికే దాదాపుగా భారతదేశాన్ని అంత కూడా జయించాడు. అయితే అశోకుడు కళింగ రాజ్యం పైన దండెత్తడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఒడిస్సా రాష్ట్రంలో కళింగ రాజ్యం ఉండేది. కళింగ రాజ్యంగ్ ఎంతో సంపన్న దేశం. అంతేకాక, అక్కడి ప్రజలు కళాత్మకంగా అద్భుతమైన నైపుణ్యం కలవారు. ఈ ప్రాంతం మొత్తం మీద, దేశానికి ఆగ్నేయంగా ప్రయాణించి అక్కడి దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగిన మొట్టమొదటి రాజ్యం కళింగ కావడం విశేషం. దాంతో ఈ రాజ్యానికి ముఖ్యమైన రేవు పట్టణాలు, బలమైన నౌకాదళం ఉండటం కూడా ఈ దండయాత్రకు ఒక కారణం అయితే, అశోకుడు వారు తండ్రి, తాత సాధించలేని దానిని నేను సాధించి వారి కోరిక నెరేవేర్చాలని అనుకున్నాడు.

The Nine Unknown Men Off Ashokaఇక అశోకుడు చేసిన ఈ కళింగ యుద్ధంలో దాదాపుగా కళింగ రాజ్య ప్రజలు లక్షకి పైగా చనిపోగా, లక్ష ఇరవై ఐదు వేల మందిని బంధీలుగా తీసుకెళ్లారు. ఈ యుద్ధమే అశోకుడి జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈ యుద్ధ సమయంలో ఉప గుప్తుడనే బౌద్ధ బోధకునితో అశోకుడు సావాసం చేసాడు. ఉపగుప్తుడు ఆయనకు బుద్దిని బొదలని ఉపదేశించాడు. ముఖ్యంగా అహింస సిద్ధాంతాన్ని అశోకునికి వివరించాడు. ఈ బోధన కళింగ యుద్ధంలో జరిగిన ఘోర రక్తపాత దృశ్యాలు, తన సైన్యం సాగించిన అకృత్యాలకు సంబంధించిన ఆలోచనలు అశోకుని కదిలించాయి. ఇక అప్పటి నుండి యుద్ధం చేయనంటూ ప్రతిజ్ఞ చేసాడు. ఇక నా రాజ్యంలో ధర్మానికి, పవిత్రతను చాటే భేరి మాత్రమే మోగుతుందని అయన ప్రకటించాడు. అప్పటి నుండి అశోకుడు ధర్మాన్ని ఆచరించేందుకు, ధర్మాన్ని ప్రేమించేందుకు ప్రజలకు ధర్మాన్ని బోధించేందుకు పరిపూర్ణంగా దీక్షా బద్దుడయ్యాడు.

The Nine Unknown Men Off Ashokaఇది ఇలా ఉంటె అశోకుడు రెండు వేల సంవత్సరాల నుండి సంగ్రమించ బడిన విజ్ఞాన బండారాన్ని రచించడానికి 9 మంది అజ్ఞాత వ్యక్తులని ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని నియమించాడు. వీరు వీరికి అప్పగించిన గ్రంధాలను సంరక్షించడమే కాకుండా ఎప్పటికప్పుడు కాలానుసారంగా వాటిని మారుస్తూ ఉండాలి. వారి అనంతరం ఈ బాధ్యతలని వారి వారసులకు అప్పగించాలి. అయితే ఇప్పటికి వారి వారసులు ప్రపంచం నలుమూలల ఆయారాంగాల్లో సేవలు అందిస్తున్నారని చెబుతారు. ఇక ఆ తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తులకి అప్పగించిన తొమ్మిది గ్రంథాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

1. propaganda and warfare :

The Nine Unknown Men Off Ashokaప్రచారంతో అంటే మాటలతోనే ప్రజలను వశపరుచుకోవడం. ఆయుధం చేత పట్టకుండా మాటలతోనే హిపంటైస్ చేసి మానసికంగా, శారీరకంగా వశపరుచుకుంటారు. ఈ గ్రంధం కనుక ఎవరి దగ్గర ఉంటె వారు ప్రపంచాన్ని శాసించవచ్చు అని చెబుతారు.

2. ఫీషియోలోజి :

The Nine Unknown Men Off Ashokaఇది శరీర సంబంధ శాస్రం. ఒక ఫింగర్ టచ్ చేసి మనిషిని చంపవచ్చు. దీనినే టచ్ ఆఫ్ డెత్ అంటారు. ఈ గ్రంధంలో చెప్పిన ట్రిక్ ద్వారా టచ్ చేస్తే అది వారి నాడి ప్రేరణను రివర్స్ చేసి అక్కడికక్కడే మరణించేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న జపాన్ లో ఫెమస్ అయినా జూడో విద్య ఈ గ్రంథంలోని కొంత సమాచారం లీక్ అవ్వడం వలనే పుట్టుకొచ్చింది అని చెబుతుంటారు.

3. మైక్రోబయాలజీ మరియు బయోటెక్నాలజీ :

The Nine Unknown Men Off Ashokaదీనిని సూక్ష్మ జీవశాస్రం మరియు జీవ సాంకేతిక శాస్రం అని అంటారు. అయితే గంగ నది హిందువులకి చాలా పవిత్రమైన నది. ఈ నదిలో రోజుకి కొన్ని లక్షల మంది స్నానం చేస్తుంటారు. అందులో చాలా మందికి చర్మ సమస్యలు ఉండి ఉంటాయి. గంగా నదిలో స్నానం చేయడం వలన ఇప్పటివరకు చర్మ సమస్యలు వచ్చినట్లుగా ఎవరు చెప్పలేదు. అంతేకాకుండా గంగ నదిలో మునిగితే పుణ్యవస్తుంది అని భక్తుల విశ్వాసం. అన్ని నదుల్లో కంటే గంగా నది చాలా పవిత్రమైనదిగా చెబుతారు. అయితే దీనికి కారణం కేవలం గంగ నది పవిత్రత ఏ కాకుండా ఈ విభాగానికి చెందిన అజ్ఞాత వ్యక్తి కొన్ని ప్రత్యేక కరమైన ఉపయోగకరమైన సూక్షజీవులను ఒక రహస్య ప్రదేశంలో కలిపాడని చెబుతుంటారు. దీనినే మనం ప్రస్తుతం sterilization అనే ప్రాసెస్ గా పిలుస్తున్నాం. అయితే గంగ నది పైన పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు ఈ నదిలో antibacterial , bacteriophage లను కనుగొన్నారు. ఇవి ఈ నీటిలో లభించినంతగా వేరే ఈ నీటిలోను లభించలేదు అని తేల్చారు. మరి ఇది దైవలీల లేదా ఆ గ్రంధం ఆధారణగా చేసిన రహస్య వ్యక్తి పనేనా అనేది స్పష్టంగా అయితే ఏది చెప్పలేము.

4. Alchemy :

The Nine Unknown Men Off Ashokaalchemy అంటే transformation of metals . ఈ గ్రంధంలో ఒక మెటల్ ని మరొక మెటల్ గా ఎలా మార్చుకోవచ్చు అనేది పూర్తిగా వివరించబడి ఉందట. ఇనుముని సైతం బంగారం లాగా మార్చే అధ్భూతా శాస్రం ఇది. భారతదేశంలో ఎప్పుడు అయితే కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దేశం క్లిష్ట పరిస్థితిల్లో ఉంటుందో అప్పుడు దేవాలయాలలో లెక్క లేనంత బంగారం హుండీలలో పోగవుతూ ఉంటుంది. మరి అంత బంగారం ఎవరు దానం చేస్తున్నారనేది ఇప్పటికి ఆశ్చర్యమే, అయితే ఈ తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తులలో ఒకరు దేశం క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు వివిధ రకాల unknown సోర్సెస్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరవేరుస్తారని కొంతమంది బలంగా నమ్ముతుంటారు.

5. గ్రావిటేషన్ :

The Nine Unknown Men Off Ashokaఇందులో విమానాలని ఎలా తయారుచేయాలనేది ఉందట, అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితమే హిందూ పురాణాలలో విమానాల గురించి ఉంది. ఇక 1903 వ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. అయితే 2013 వ సంవత్సరం ఆఫ్గనిస్తాన్ లో దొరికిన ఒక విమానం 5 వేల సంవత్సరాల నాటిదిగా గుర్తించారు.

6. కమ్యూనికేషన్:

The Nine Unknown Men Off Ashokaకమ్యూనికేషన్ అంటే ప్రచార సాధనం. ఇది మనం ఇప్పుడు యూస్ చేస్తున్న ఫోన్ లాంటిదే. అయితే మనం యూస్ చేసే ఈ ఫోన్ భూమి వరకే పరిమితం. కానీ ఈ గ్రంధంలో ఉన్న దానిప్రకారం గ్రహాంతరవాసులతో కూడా ఎలా కమ్యూనికేట్ అవ్వాలో ఉంది అని అంటారు.

7. sociology :

The Nine Unknown Men Off Ashokaఇది సామజిక శాస్రం. ఈ గ్రంధంలో సమాజానికి కావాల్సిన నియమ నిబంధనలు, సమాజ అభివృధ్ధికోసం మార్గదర్శకాలు మొదలగు సమాచారం ఇందులో పొందబరచి ఉంది.

8. కాస్మొలోజి :

The Nine Unknown Men Off Ashokaఇది విశ్వాశాస్రం. ప్రపంచ పుట్టుక దాని పరిణామాల గురించి చెప్పే అంతరిక్షశాస్రం. ఈ యూనివర్స్ లో ఒకచోటు నుండి మరొక చోటుకి అలాగే ఒక యూనివర్స్ నుండి మరొక యూనివర్స్ కి కూడా క్షణంలో ఎలా చేరుకోవాలనేది రాసి ఉందట. టైమ్ ట్రావెల్ కూడా ఈ గ్రంధంలో పొందబరచి ఉందట.

9 . లైట్:

The Nine Unknown Men Off Ashokaకాంతివేగాన్ని మించి ప్రయాణించడం అసాధ్యం. అయితే కాంతివేగాన్ని కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి ఈ గ్రంధానికి ఉంది. ఇంకా కాంతివేగాన్ని ఎక్కువ తక్కువగా కంట్రోల్ చేస్తూ ఒక వెపన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనేది ఈ గ్రంధంలో ఉందట.

అయితే మొట్టమొదటగా ఈ అజ్ఞాత వ్యక్తుల గురించి తాల్ బట్ ముండి అని రచయిత తన ది నైన్ అన్నోన్ అనే పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియచేసారు. ఈ పుస్తకంలో ఈ తొమ్మిది మందిని హీరోలుగా వర్ణించాడు. అయితే 10 వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చినా పోప్ సిల్వెస్టర్ కి కలసి అతేంద్రియ శక్తులు, మాట్లాడే రోబోట్ ఇచ్చారని చెబుతుంటారు. సిల్వెస్టర్ చనిపోయినా తరువాత ఆ రోబో ని ధ్వంసం చేసారు. అంతేకాకుండా భారతదేశ శాస్త్రవేత్తలు అయినా విక్రమ్ సారాభాయ్, జగదీష్ చంద్రబోస్ వెనుక ఈ తొమ్మిది మంది వ్యక్తుల హస్తం ఉందనే రూమర్లు బలంగా ఉన్నాయి. ఇంకా సరైన టెక్నాలజీ లేని రోజుల్లో ఢిల్లీలో కట్టిన ఐరన్ పిల్లర్, పూరి, హంపీల విచిత్ర నిర్మాణం ఈ ప్రశంకి మరింత ఊతాన్ని ఇస్తున్నాయి.

The Nine Unknown Men Off Ashokaఈవిధంగా అశోకుడు ఆ కాలంలోనే దుష్టల చేతిలోకి వెళ్లి ప్రపంచం నాశనం అవ్వకుండా తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తులకి ఒక్కో విభాగాన్ని ఇచ్చి పంపించాడని చెబుతారు. అయితే యువనుల దాడుల వల్ల రాజుల అసమర్థత, అహింసావాదం కారణంగా అశోకుని మరణానంతరం 47 సంవత్సరాలకు మౌర్య సామ్రాజ్యం అంతమయింది.

మొదట్లో హింసామార్గాన్ని ఎంచుకొని కళింగ యుద్ధం తో హింసని వీడి అహింస మార్గం వైపు నడిచి ప్రజలని ధర్మ మార్గంలో నడిపిస్తూ, రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించడం, జంతువులకి వైద్య శిబిరాలు నిర్మించడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అశోకుడు ప్రపంచంలోనే ఒక గొప్ప చక్రవర్తిగా చరిత్రలో నిలిచిపోయాడు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR