జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు గురించి తెలుసా ?

జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు(మసాలా) దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma cyminum. గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ , ఔషధము గాను వాడుతారు . ఎంతో రుచిగా వుండే ఈ జీలకర్ర లేకుండా మనదేశంలో సాధారణంగా ఏ వంటకం వుండదు. వేడి వేసవిలో ఒక్క గ్లాసెడు మజ్జిగలో జీర వేసుకు తాగితే ఎంతో హాయినిస్తుంది. జీలకర్ర వేయిస్తే దాని రుచి మరింత పెరుగుతుంది ఎం సామాన్యమైన వంటకం అయినా సరే జీలకర్ర పడితేచాలు అసాధారణ వంటకం అయిపోతుంది. అటువంటి జీలకర్ర లో ఔషధ గుణాలు తెలుసుకుందాం.

medicinal properties of cuminజీలకర్ర వల్ల బరువు తగ్గుతుందని, కొవ్వును తగ్గించడంతోపాటు చెడు కొవ్వును చేరకుండా కాపాడుతుందని తాజా పరిశోధనలో తేలింది. జీరా-అరటిపండు మిశ్రమం కూడా మీ వెయిట్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఉండే థెమోల్, ఇతరాత్ర నూనెలు ఆహారం జీర్ణమయ్యేందుకు ఉపయోగపడతాయి. ఎప్పుడైనా అజీర్ణంతో బాధపడితే జీలకర్ర టీ తాగండి. ఒక గ్లాసు నీళ్లలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి బ్రౌన్ కలర్‌లోకి మరే వరకు మరిగించండి. మరీ, వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని జీలకర్ర టీలా తాగండి.

medicinal properties of cuminరెండు స్పూన్ల(పెద్దవి) జీలకర్రను ఒక గ్లాసుడు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం మార్నింగ్ టీగా తాగండి. అందలోని జీలకర్రను చప్పరించి ఊసేయండి. ఇలా రోజూ చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు. అలా, కష్టం అనుకుంటే. ఆహారంతోపాటు తీసుకోండి. ఐదు గ్రాముల పెరుగులో ఒక స్పూను జీలకర్ర వేసుకుని తిన్నా బరువు తగ్గుతారు.

medicinal properties of cuminరుచిగా తినాలనుకునేవారు. మూడు గ్రాముల జీలకర్రను నీటిలో వేసి కాస్త తేనె కలిపి రోజూ తీసుకోండి. లేదా బ్రౌన్ రైస్, విజిటేబుల్ సూప్‌లో ఒక స్పూను జీలకర్ర వేసుకుని తీసుకోండి. అల్లం, నిమ్మకాయలతో కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితం కనపడవచ్చు. క్యారెట్ , కొన్ని కూరగాయలను ముక్కులుగా కోసి ఉడికించండి. అందులో నిమ్మ, అల్లం మిశ్రమాన్ని వేసి, దానిపై జీలకర్ర ఫౌడర్‌ను చల్లి రోజూ రాత్రివేళల్లో తింటే తప్పకుండా బరువు తగ్గుతారు.

medicinal properties of cuminఇలా 15 రోజుల పాటు పాటిస్తే తప్పకుండా మీ బరువులో మార్పు కనపడుతుంది. జీలకర్ర పొట్ట వద్ద పేరుకుపోయే చెడు కొవ్వును కరిగిస్తుందని, పరిశోధనలు తెలుపుతున్నాయి. జీలకర్ర ద్రవాన్ని తాగితే ఆ రోజంతా మీరు ఫ్రెష్‌గా ఉంటారు.

medicinal properties of cuminఅమెరికాలోని సౌత్ కరోలినాలో గల క్యాన్సర్ రీసెర్చ్ ల్యాబరేటరీ ఆఫ్ హిల్టన్ హెడ్ ఐల్యాండ్ అధ్యయనం ప్రకారం జీలకర్ర క్యాన్సర్‌పై పోరాడుతుంది. శరీరంలో గడ్డలను నివారించే శక్తి దీనికి ఉంది. కాలా జీరా(నల్ల జీలకర్ర)లో ఈ గుణాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జీలకర్రలో ఉండే పోటాషియం హార్ట్ పేషెంట్లకు మేలు చేస్తుంది. బీపీ, హార్ట్ రేట్‌లను నియంత్రిస్తుంది. శ్వాస సమస్యలు, వాపు, జాయింట్ ఇన్ఫెక్షన్లు, పేగు సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు, పంటి నొప్పికి ఇది మంచి ఔషదం.

ఒళ్లు వేడెక్కడం, దురదలు రావడం వంటి సమస్యలు ఏర్పడితే నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత ఆ నీటితో స్నానం చేయండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR