మధుమేహాన్ని నివారించే మార్గాలు ఏంటో తెలుసా ?

రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటే అది రక్త నాళాలాను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. శరీరంలో రక్తం సక్రమంగా ప్రవహించలేకపోతే రక్తం అవసరమైన శరీర భాగాలకు అది చేరదు. దానివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినటం, చూపు కోల్పోవటం, కళ్లకు ఇన్ఫెక్షన్లు వంటి ప్రమాదాలు పెరుగుతాయి.

any ways to prevent diabetesఅంధత్వం, మూత్రపిండాలు దెబ్బతినటం, గుండె పోటు, పక్షవాతం, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి వాటికి మధుమేహం ప్రధాన కారణమని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. 2016లో 16 లక్షల మంది నేరుగా మధుమేహం వల్లే చనిపోయారు. అయితే ఇటువంటి మధుమేహాన్ని నివారించగలమా తెలుసుకుందాం.

any ways to prevent diabetesమధుమేహం అనేది జన్యు సంబంధిత, పరిసరాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

  • చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవటం మంచిది.
  • పండ్లు, కూరగాయలు, బీన్స్, సంపూర్ణ తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవటం అందులో తొలి అడుగు.

any ways to prevent diabetes

  • ఆరోగ్యకరమైన నూనెలు, పప్పులు, సార్డిన్లు, సాల్మన్ల వంటి ఒమెగా-3 పుష్కలంగా ఉండే చేపలు కూడా ఆరోగ్యవంతమైన ఆహారంలో భాగమే.
  • రోజూ సమయానికి ఆహారం తీసుకోవటం కడుపు నిండగానే తినటం ఆపేయటం ముఖ్యం.
  • రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి శారీరక వ్యాయామం కూడా దోహదపడుతుంది.

any ways to prevent diabetes

  • వారం రోజుల్లో కనీసం రెండున్నర గంటల పాటు వేగంగా నడవటం, మెట్లు ఎక్కటం వంటి వ్యాయామం ఉండాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ సిఫారసు చేస్తోంది.
  • కదలకుండా కూర్చునే జీవనశైలిని వదిలిపెట్టటం.. వారంలో కనీసం రెండున్నర గంటలు ప్రతి రోజు వ్యాయామం చేయటం ముఖ్యం.
  • ఆరోగ్యవంతమైన బరువు కూడా శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించటానికి సాయపడుతుంది. ఒకవేళ బరువు తగ్గాల్సి ఉంటే నెమ్మదిగా తగ్గటానికి వారానికి అర కేజీ నుంచి కేజీ చొప్పున తగ్గటానికి ప్రయత్నించండి.

any ways to prevent diabetes

  • హృద్రోగాల ముప్పును తగ్గించుకోవటానికి కొవ్వు (కొలెస్టరాల్) స్థాయి కూడా పరిమితుల్లో ఉండేలా చూసుకోవటం, ధూమపానానానికి దూరంగా ఉండటం కూడా ముఖ్యమే.
  • బయట దొరికే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినడం మంచిది కాదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR