గోళ్లు కొరకడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఎందుకో తెలుసా

గోళ్లు కొరకడమనేది చాలామందికి ఉండే ఓ బ్యాడ్ హాబిట్. చాలామంది గోళ్లు కొరుకుతూ లేని పోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. టివి చూస్తున్నప్పుడో, పుస్తకం చదువుతున్నప్పుడో కొందరు గోళ్లు కొరుకుతుంటారు. మ‌రికొంద‌రు తెలియ‌కుండానే ఇలా గోళ్లు కొరుక్కుంటారు. ఇది మారలేని ఓ అలవాటుగానూ మారుతుంటుంది.

dangerous it is to bite nailsనిజానికి దీంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయి. గోళ్లు కొరకడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అస‌లు చేతి వేళ్ల‌ల్లో గోరుల్లో ఉండే మ‌ట్టి మ‌న శ‌రీరంలోకి వెళితే రోగాలకు మ‌నం ఆహ్వానం ప‌లికినట్టే. గోళ్లును కొరకడం ద్వారా గోటిలోని మురికి శరీరంలోనికి పోతుంది. తద్వారా ఈ-కోలీ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోటినుంచి శరీరంలోకి వెళుతుంది.

dangerous it is to bite nailsఅస‌లు ఇలా మ‌నం ఎందుకు గోళ్లు కొరుకుతామో తెలుసా? ఇది చిన్న‌త‌నం నుంచి వ‌చ్చే అల‌వాటు, అయితే చిన్న‌త‌నంలో పెద్దలు మాన్పిస్తే ఒకే. లేదు అంటే ఈ అల‌వాటు అవుతుంది.. దీనిని ఒనికోఫాగియా అని వైద్య భాష‌లో అంటారు, అయితే ప్ర‌ధానంగా బోరింగ్ ఫీల్ అయినా కోపం వచ్చినా ఎక్కువ‌గా ఇలా గోళ్లు కొరుకుతారు. గోళ్లను కొరికినపుడు ఇవి ముందు నోట్లోకి.. అక్కడ నుంచి పేగుల్లోకి చేరుకుంటాయి. ఇవి జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తాయి. ఫలితంగా అతిసారం, కడుపు నొప్పి వంటి సమస్యలు దాడి చేస్తాయి.

dangerous it is to bite nailsగోళ్లు కొరికే అలవాటు ఉన్నవారికి హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమూ ఎక్కువే. నిరంతరం గోళ్లు కొరకటం వల్ల దంతాల ఆకారమూ దెబ్బతినవచ్చు. చిగుళ్ల వ్యాధులు, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌ కూడా రావచ్చు. దీర్ఘకాలంగా గోళ్లు కొరికే అలవాటు గలవారికి పారానైకియా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమూ ఉంది. వీరి వేళ్ల చివరన చర్మం మీద పడే పంటిగాట్ల ద్వారా బ్యాక్టీరియా లేదా ఈస్ట్‌ లోపలికి ప్రవేశించి గోళ్ల కింద వాపు, చర్మం ఎర్రబడటం, చీము పోగుపడటం వంటి సమస్యలు వస్తాయి. ఏదేమైనా గోళ్లు కొరికే అలవాటు ఉన్న వారు దీని నుంచి త్వరగా బయటపడడం మంచిది.

dangerous it is to bite nailsఅయితే గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోవడం ద్వారా అమ్మాయిలు ఇలా వీటిని కొరక్కుండా ఆపుకోవ‌చ్చు. దీనితో పాటు ఒత్తి‌డి లేకుండా ఉంటే గోళ్లు కొరకడం మాన‌వ‌చ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR