డయాబెటిస్ ఉందొ లేదో ఏ విధముగా గుర్తించవచో తెలుసా ?

ఈ మధ్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామందిలో కనిపిస్తున్న సమస్య డయాబెటిస్. ఇందులో రెండు రకాలు.. టైప్ -1, టైప్ -2 డయాబెటిస్. వీటిలో సాధారణంగా ‘టైప్-1’ డయాబెటిస్‌ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. వీరు ఇన్సులిన్‌ను వాడాల్సి ఉంటుంది. టైప్ -2 డయాబెటిస్ అసహజ జీవన శైలి, వంశపారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు. ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నపుడు, లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సివచ్చినపుడు చాలామందిలో మధుమేహం బయటపడుతుంది.

diabetesటైప్-2 డయాబెటిస్‌ బయటపడటానికి పదేళ్ల ముందే కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటిస్‌ను గుర్తించొచ్చు. చక్కెర వల్ల మధుమేహం వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. చక్కెర వ్యాధికి, చక్కెరకు ప్రత్యక్ష సంబంధం ఏదీ లేదు. చక్కెర ఎక్కువగా తీసకుంటే శరీరం బరువు పెరుగుతుంది. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. స్థూలకాయం వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

diabetesమనలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి డయాబెటిస్ ఉందొ లేదో గుర్తించొచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఎక్కువగా మూత్రవిసర్జన అవుతూ ఉంటుంది. అదికూడా రాత్రి వేళ్ళల్లో ఎక్కువగా అవుతుంది. దీనితోబాటు అధిక దాహం కూడా ఉంటుంది. రక్తం లో ఉన్న గ్లూకోజ్ బయటకు పంపేందుకు శరీరానికి నీటి అవసరం అవుతుంది, అందువల్ల అధిక దాహం కలుగుతుంది. తాగిన నీరు గ్లూకోజ్ తో కలిసి మూత్రరూపంలో బ‌య‌ట‌కు పోతుంది. రోజుకు 10కన్నా ఎక్కువసార్లు ముత్ర విసర్జన చేస్తే డయాబెటిస్ వచ్చే అవ‌కాశం ఉందని గ్రహించాలి.

diabetesఇక కొంతమంది ఉన్నట్టుండి బరువు తగ్గిపోతూ ఉంటారు. సాధారణంగా డయాబెటిస్ లక్షణం ఉన్న‌వారు ఒక్కసారిగా శరీర బరువుని కోల్పోతారు. ఎలాంటి వ్యాయామం చెయ్యకపోయినా ఏ డైటింగ్ చేయకపోయినా బరువు తగ్గినట్టయితే మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అలాగే డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా అలసిపోతుంటారు. ఏపని చేసిన వెంటనే అలసిపోవడం జరుగుతుంది. మత్తుగా ఉండటం ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది.

diabetesశరీరంలో తయారయ్యే ఇన్సులిన్ కణాలు మనం తినే తిండిని సరిగా గ్రహించలేవు. మనం తీసుకొనే ఆహారం గ్లూకోజ్ గా మారుతుంది. ఆ గ్లూకోజ్ ను ఇన్సులిన్స్ సరిగా గ్రహించకపోవడం వాళ్ళ మెదడుకు ఆహారం పంపమని సిగ్నల్ పంపుతుంది. అందుకే అధికంగా ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. కాలికి ఎదైనా దెబ్బ తగిలితే అది త్వరగా మానకపోతే అది డయాబెటిస్ లక్షణంగా గుర్తించాలి. అశ్రద్ద చేస్తే ఆ గాయం మరింతముదిరి చివరకు ఆ అవయువాన్ని తొలగించే ప్రమాదం ఉంది. కనుక అలంటి సమస్య వచ్చినప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం.

diabetesడయాబెటిస్ ఉన్నవారికి కొద్దిగా దృష్టి మందగిస్తుంది. మసకగా కనపడటం దూరంగా ఉండే వస్తువుల్ని గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నవారు నిర్లక్షం చేయకుండా డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం. డయాబెటిస్ వాళ్ళ రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల శరీరంలో ఉండే కణాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఎక్కువ. దీనివల్ల మన శరీరంపైకొన్ని చోట్ల స్పర్స లేకోవడం, ఆ ప్రాంతం లో సూదులతో గుచ్చినట్లు ఉండటం జరుగుతుంది.

diabetesఅవసరానికి మించి షుగర్ తీసుకుంటే, ఎవరికైనా షుగర్ స్థాయి పెరుగుతుంది. షుగర్ ఎక్కువగా ఉన్నపుడు తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, అలసట, నీరసం.. లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి లక్షణాలు కనిపించినంత మాత్రాన కంగారు పడకూడదు. క్రమం తప్పని రక్త పరీక్షలు, ఆరోగ్యవంతమైన ఆహారం ద్వారా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR