అరటి పండు తినడం పూర్తవగానే సెకను ఆలోచించకుండా తొక్క తీసి బయట పడేస్తాం కానీ అది ఎండిపోయి, మట్టిలో పూర్తిగా కలిసిపోవడానికి 29 రోజులు పడుతుందని మీకు తెలుసా? అరటిపండు అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదీ, తినడం తేలిక, వెంటనే ఎనర్జీ ఇస్తుంది, అజీర్తి సమస్యకు చెక్ పెడుతుంది అని మనకు తెలుసు కాబట్టి ఇష్టంగా తింటాం.
అరటి పండు తొక్క వల్ల ఉపయోగాలేంటో తెలియవు కాబట్టి తొక్కలోది తొక్కే కదా అంటూ పక్కన తొక్కను పారేస్తాం. అయితే తొక్కే కదా అని చిన్నచూపు చూస్తే చాలా కోల్పోయినట్లే. అరటి తొక్క… ఆ పండుకి రక్షణ ఇవ్వడమే కాదు… మనకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అరటిలో విటమిన్ B6 ఉంటుంది. అలాగే ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవే పోషకాలు అరటి తొక్క నుంచి కూడా లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖంపై కురుపులు, మొటిమలు, పొక్కుల వంటివి ఉంటే… అరటి తొక్క చక్కటి స్కిన్ కేర్‌లా పనిచేస్తుంది. ఎక్కడ గాయాలు, కురుపులు ఉంటే అక్కడ అరటి తొక్కతో రుద్దుకోండి. అన్నీ మటుమాయం అవుతాయి.
ముఖం చర్మంపై నల్లటి మచ్చలు ఇతరత్రా ఉంటే వెంటనే ఓ అరటి పండు తిని… ఆ తొక్కను మచ్చలపై ఉంచండి. అతుక్కునేలా నెమ్మదిగా అదమండి. ఇలా ఓ పావు గంట ఉంచి, నీటితో ఫేస్ కడుక్కోండి. ఇలా రోజుకు 2 లేదా 3 సార్లు చేశారంటే… ఓ వారంలో అన్ని మచ్చలు మాయమవుతాయి. అరటి తొక్కతో రోజుకు రెండుసార్లు చర్మంపై రుద్దుకోండి. మసాజ్ చేసుకోండి. తొక్కలోని ఔషధ గుణాలు చర్మ రంధ్రాల్లోకి వెళ్లి అక్కడున్న బ్యాక్టీరియాను చంపేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
చర్మంపై ముడతల్ని చూస్తే చాలా మంది ఏజ్ పెరుగుతోందేమో అని భయపడతారు. ఆ భయం లేకుండా… ముడతలు ఉన్న చోట… అరటి తొక్కతో రుద్దుకోండి. అంతే… ముడతలు మెల్లగా పోతాయి. అలా అవి పోయేవరకూ తరచూ రుద్దుతూ ఉండండి.
రోడ్డు ప్రమాదాల్లోనే, మరే కారణాలతోనే గాయాలు అయితే గాయం ఉన్న చోట అరటితొక్కల్ని ఉంచి గుడ్డతో గట్టిగా కట్టండి. ఇలా చేస్తే నొప్పి తగ్గడమే కాదు గాయం కూడా తగ్గుతుంది. ఏ పురుగులో, తేనెటీగలో కుట్టినప్పుడు కూడా ఇలా చెయ్యవచ్చు.
మీరు పండ్లు తోముకునే ముందు అరటి తొక్కలతో ఓ నిమిషంపాటూ పండ్లు తోమండి. ఇలా రోజూ చేస్తూ వారం పాటూ చేస్తే. మీ దంతాలు ఇదివరకు ఎప్పుడూ లేనంత క్లీన్ అయిపోతాయి. మీరే ఆశ్చర్యపోతారు.