Home Health కొవ్వు ఉన్న పాలు తాగే పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం ఉందా ?

కొవ్వు ఉన్న పాలు తాగే పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం ఉందా ?

0

చాలా మంది పిల్లలతో తల్లి తండ్రులు ఎదుర్కొనే సమస్య పాలు తాగించడం. పాలు తాగే విషయంలో పిల్లలు మారాం చేస్తుంటారు. పిల్లలతో పాలు తగ్గించడానికి తల్లిదండ్రులు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే వారి శరీరానికి కావాల్సిన పోషకాలు పాలతోనే అందుతాయి కాబట్టి, పిల్లలకు పూర్తి పోషకాలు అందాలంటే వారికి పాలు పట్టించడం తప్పనిసరి అయిపోయింది.

ఫ్యాటీ మిల్క్పిల్లలు పూర్తి కొవ్వు పాలు కాకుండా తక్కువ కొవ్వు ఉన్న పాలు మాత్రమే తాగడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు తల్లిదండ్రులు కూడా ఫ్యాట్ ఉన్న పాలు తాగడం వలన పిల్లలు బరువు పెరుగుతారు అని భావిస్తూ ఉంటారు. అయితే అది కరెక్ట్ కాదని అంటున్నారు నిపుణులు. తక్కువ కొవ్వు ఉన్న పాలు తాగిన వారికంటే పూర్తి కొవ్వు పాలు తాగే పిల్లలకు ఉబకాయం వచ్చే అవకాశం తక్కువ ఉందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.

పాలలో కొవ్వు ఉంటే అధిక రుచితో పాటు చిన్న పిల్లలకు అవసరమైన శక్తిని కూడా అందిస్తుందని వివరించింది. అందుకోసం పిల్లలకు ఎక్కువ కొవ్వు ఉన్న పాలు ఇవ్వటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు భావిస్తున్నారు. పూర్తి కొవ్వు పాలలో అధిక పోషక విలువలు ఉండటం వల్ల పిల్లలకు శక్తి లభిస్తుందని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు పిల్లలు పాలు తాగటానికి మారం చేస్తే పాలకి బదులుగా వేరే పోషక ఆహారాన్ని వారి డైట్ లో చేరుస్తారు. అయితే ఆవు పాలు పిల్లలకు పట్టించడం తప్పనిసరి ఎందుకంటే కొవ్వు పదార్ధం ఆవు పాలల్లో ఎక్కువగా ఉంటుంది. పాలల్లో ఉండే కాల్షియం, అయోడిన్, విటమిన్లు ఎ మరియు బి 12, మరియు కొవ్వు పిల్లలకు మంచి బలాన్ని అందిస్తాయి.

 

Exit mobile version