చియా విత్తనాల వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?

0
282

ఫుడ్ లో సూపర్‌ఫుడ్’ అనే పదం చియా విత్తనాలకు సరిగ్గా సరిపోతుంది. చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు కూడా వాటిని సూపర్ ఫుడ్ అనే అంటారు. మరి వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా..

benefits of chia seedsఅసలు చియా విత్తనాలు అంటే ఏమిటి? ఎప్పుడూ వినలేదు.. ఈ మధ్యే ఎక్కువగా వింటున్నాం.. ఎక్కడ దొరుకుతాయి అంటే.. చియా విత్తనాలను శాస్త్రీయ పరిభాషలో శాన్వియా హిస్పానికా అని పిలుస్తారు. ప్రకృతి మనకు అందించిన అతికొద్ది సూపర్ ఫుడ్లలో చియా విత్తనాలు ఒకటిగా పరిగణించబడతాయి.

benefits of chia seedsమెక్సికోలో ఉద్భవించిన ఈ విత్తనాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు , ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాల్షియంలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇటీవలి కాలంలో, చియా విత్తనాల యొక్క ప్రయోజనాలు పరిశోధనల ద్వారా మరింత ఎక్కువని తేలింది. ఈ విత్తనాలు పెంపుడు జంతువులకు కూడా మంచివి. వీటిని నిల్వ చేయడం కూడా సులభం. మరి వీటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

ఆకలి వేయదు:

benefits of chia seedsఈ విత్తనాలకు కొద్దిగా తడి తగిలినా అవి ఉబ్బిపోయి, వాటి బరువు పదింతలు పెరుగిపోతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలిగి మాటిమాటికి ఆకలి కానివ్వదు.

బౌల్ మూమెంట్:

చియా సీడ్స్ నీటిలో వేయగానే జిగురులా మారిపోతుంది. ఈ సబ్జగింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రత సైతం తగ్గించి బౌల్ మూమెంట్ సమస్యను నివారిస్తాయి.

గాయాలను మాన్పుతాయి:

benefits of chia seedsశరీరంలోపల మాత్రమే కాదు, శరీరం బయట భాగాన్ని కూడా కాపాడుటలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి, కొద్దిగా నూనె కలిపి గాయాల మీద అప్లై చేయాలి. ఇలా చేస్తే గాయాలు త్వరగా తగ్గుతాయి.

రక్తాన్ని శుద్ది చేస్తాయి:

benefits of chia seedsరక్తంలోని మలినాలను తొలగించడంలో దీని తర్వాతే ఏదైనా.

శ్వాస సమస్యలు:

benefits of chia seedsశ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె నానబెట్టిన చియా సీడ్స్, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాస సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

క్రీడాకారులకు:

క్రీడాకారులకు ఈ విత్తనాలు బాగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటుంటే శరీరంలో తేమను పోనివ్వకుండా నిలిపి ఉంచుతాయి.

గొంతులో మంట, ఆస్తమా:

benefits of chia seedsగొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, లాంటి సమస్యలు బాధిస్తుంటే?అలాంటి సమయంలో ఈ గింజల్ని నీళ్ళలో వేసి నానబెట్టి నేరుగా తినేయాలి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

బిపిని కంట్రోల్ చేస్తుంది:

benefits of chia seedsమీరు హైబిపితో బాధపడుతున్నట్లైతే వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపి క్రమంగా అదుపులోకి వస్తుంది.

ఆర్ధరైటీస్, హార్ట్ సమస్యలు:

benefits of chia seedsచియాసీడ్స్ లో సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల ఆర్ధరైటిస్, మరియు హార్ట్ సమస్యలు రాకుండా ఉంటాయి.

అలర్జీలు:

benefits of chia seedsవీటిలో యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా సంబంధిత అలర్జీల నుండి రక్షిస్తాయి.

 

SHARE