Home Health అత్యంత ప్రభావవంతమైన వంటింటి ఔషధాలను ఎలా ఉపయోగించవచ్చో తెలుసా ?

అత్యంత ప్రభావవంతమైన వంటింటి ఔషధాలను ఎలా ఉపయోగించవచ్చో తెలుసా ?

0

ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఆసుపత్రికి పరుగుపెడతాం. అయితే మన వంటగదిలోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయి. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. కడుపు నొప్పికి అల్లం, వికారం కోసం పుదీనా, మంటకు పసుపు ఇలా చాలా సాధారణంగా ఇంట్లో దొరికే వస్తువులు ప్రభావవంతమైన రోగ నివారణలు కావచ్చు. ప్రతి ఇంట్లో దొరికే సుగంధ ద్రవ్యాలు / మూలికలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతాయి. అవసరమైన సమయంలో వాటిని ఇంటి నివారణగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

1. పసుపు

పసుపు అనేది ఆసియాలో వేలాది సంవత్సరాలుగా ఉపయోగించబడుతుంది. భారతదేశంలో విస్తృతంగా వాడబడే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఒకటి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో పసుపు ముందుంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. పసుపులో అత్యంత శక్తివంతమైన కర్కుమిన్ అనే సమ్మేళనం ఉండడమే ఇందుకు కారణం. ఇది దాదాపు అన్ని విధాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, డయాబెటిస్ (మధుమేహం), మరియు అల్జీమర్స్ చికిత్సలలో ఉపయోగపడుతుంది. ఒక అంగుళం అల్లం రూట్ తీసుకొని, పై తొక్క తీసి, ముక్కలుగా కోసి, తరువాత ఉడకబెట్టండి. ఉపశమనం కోసం దీనిని టీ రూపంలో త్రాగాలి. లేదా మీరు చక్కెర, అల్లం మరియు కొన్ని చుక్కల నీటిని కలపవచ్చు, ఒక చెంచా ఉపయోగించి రసాన్ని తీయవచ్చు. ఇలా సేవిస్తే చక్కని ఫలితం ఉంటుంది.

benefits of home remediesపసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, మరియు యాంటిక్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని ఎన్నోఅధ్యయనాలు పేర్కొన్నాయి. పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడుతుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణను కూడా నిరోధిస్తుంది. అంతేకాదు పసుపును చర్మంపై కోతలు, గాయాలు, జీర్ణక్రియ సమస్యలు, జలుబు మరియు దగ్గు మరియు చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. పలు సౌందర్య ఉత్పత్తులలో కూడా పసుపును వాడతారు. చర్మ సౌందర్యానికి పరమ ఔషధంగా చెప్పవచ్చు.

2.వెల్లుల్లి 

సాధారణంగా వెల్లుల్లిని వంటలో రుచి కోసం వాడుతారు.. కానీ దానిలో అనేక ఔషధాలు పుష్కలంగా ఉన్నాయనేది కానీ.. దానివల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది కానీ తెలియదు. వాస్తవంగా మీరు ఆరోగ్యవంతంగా ఉండటంలో వెల్లుల్లి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జలుబు, జ్వరం, ఫ్లూ, క్యాన్సర్ వంటి వ్యాధులను అరికడుతుంది.ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పరిగడుపుతో.. నీరు, పచ్చి వెల్లుల్లి సేవించడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. వెల్లుల్లి దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. తరచుగా వెలుల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల లైంగికపటుత్వం పెరుగుతుంది.

ప‌చ్చి వెల్లుల్లి గుండెను కాపాడ‌తుంది. రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది.

3. అల్లం

వంటింట్లో వున్న ఔషదాల్లో ఒక గొప్ప ఔషదం అల్లం. ఎన్నో ఆరోగ్య సమస్యలకి వంటింట్లో వున్న ఈ దివ్య ఔష్యదంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అల్లంలో ఉండే ఔషద గుణాలు పొట్టలో వున్న గ్యాస్‌ని బయటికి పంపించేయడానికి ఉపయోగపడతాయి. ఫలితంగా పొట్ట ఉబ్బరం, నొప్పి నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది.

వికారం, వాంతులు, ఉదయం అనారోగ్యం, రుతు నొప్పి మరియు చిన్న ఇన్ఫెక్షన్ల నుండి అల్లంతో ఉపశమనం పొందవచ్చు. పీరియడ్స్‌ ఓ 4 రోజుల ముందు నుంచే అల్లం టీ తాగడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు చాలావరకూ దూరమవుతాయి. అల్లంలోని గొప్ప గుణాలు ఆర్థరైటీస్ వల్ల వచ్చే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనేలో కొన్ని అల్లం రసం చుక్కల్ని వేసి ఓ మిశ్రమంగా కలిపి తీసుకుంటే, జలుబు, దగ్గు హుష్‌కాకి అవుతాయి. రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఇలా చేయాలి.

4. పుదీనా

వాడకుండానే సువాసన వచ్చే అద్భుతమైన మొక్క పుదీనా. ఇది వంటకు మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాదు… ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వాంతులు, వికారంగా అనిపిస్తున్నప్పుడు ఒకట్రెండు పుదీనా ఆకుల్ని తీసుకొని ముద్దలా చేసి, కొద్దిగా పంచదార లేదా యోగర్ట్ కలిపి తింటే ఫలితం కనిపిస్తుంది. పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అలర్జీని దూరం చేస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా దరిచేరనివ్వదు. పుదీనా ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి.

కలరా సమస్య ఉంటే నిమ్మరసం, మామిడి రసం, తేనె కలిపి తాగితే ఫలితం ఉంటుంది. దగ్గు అదేపనిగా వస్తుంటే పుదీనా ఆకుల రసం, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పుదీనాలో ఉండే ఐరన్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. అంతేకాదు పుదీనా తరచూ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. నుదుట మీద పుదీనా ఆకుల రసం రాయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనాతో తయారుచేసే నూనెలు, క్రీములు తలనొప్పిని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది.

5. తేనె

తేనెలో విటమిన్ సి (Vitamin C), విటమిన్ బీ6, ఫ్రక్టోస్, కార్బోహైడ్రేట్లు, రైబోఫ్లోవిన్, నియాసిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. కాలిన గాయాలు, ఇతర గాయాల నుంచి తేనె ఉపశమనం కలిగిస్తుంది. గాయమైన చోట తేనే రాస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

గోరు వెచ్చని నీటిలో మిరియాలపొడి, తేనె, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం , అజీర్ణం , కడుపునొప్పి ఇలా అనేక స‌మ‌స్య‌ల‌కు తేనెతో చెక్ పెట్ట‌వ‌చ్చు. తేనే, నిమ్మరసం కలిపి తీసుకుంటే అదనపు కొవ్వు నిల్వలు కరుగుతాయి.కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి.

తేనె – నిమ్మకాయ, తేనె – పాలు, తేనె – అరటిపండు ఇలా ఏదైనా కాంబినేషన్‌తో ఫేస్ ప్యాక్ చేసుకుని చర్మానికి రాసుకోవాలి. కొంత సమయానికి ముఖం కడుక్కుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే మరికొన్ని కాంబినేషన్ లు ఇప్పుడు చూద్దాం. గొంతు, జలుబు (తేనె + నిమ్మ), గొంతు, కడుపు (అల్లం + తేనె), పంటి నొప్పి (లవంగం + తేనె), యాసిడ్ రిఫ్లక్స్ (ఆపిల్ సైడర్ వెనిగర్ + తేనె), మొటిమలు (తేనె + పెరుగు ఫేస్ మాస్క్) మరియు గొంతు కండరాలు (తేనె + కొబ్బరి నీరు).

6. దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్కతో ఉండే 41 సమ్మేళనాల వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని అధ్యయనాల్లో నిరూపితమైంది. ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగే కొవ్వు తగ్గుతుంది. దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను మర్దన చేయడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. నిత్యం ఒక స్పూన్ దాల్చిన చెక్క‌ పొడిని తీసుకుంటుంటే మధుమేహం తగ్గుతుంది. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు పట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు 3 పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు. బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావం బారి నుంచి కూడా కాపాడవచ్చు.

దాల్చిన చెక్కతో మరిన్ని కాంబినేషన్ లు: మొటిమలు మరియు బ్లాక్‌హెడ్స్ (దాల్చినచెక్క + నిమ్మరసం), దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, నిద్రలేమి (వేడి నీరు + 1/2 చెంచా దాల్చినచెక్క + మిరియాలు పొడి) చికిత్సకు దాల్చినచెక్కను ఉపయోగించవచ్చు.

7. మెంతి

మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే తరతరాలుగా మెంతులను జుట్టు పెరగడానికి కండిషనర్ గా వాడుతున్నారు. మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును తడిపి 10 నిమిషాలు వదిలేసి ఆపై కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. మెంతులను ఉడకబెట్టి, పేస్ట్ చేసి ఆ పేస్ట్ ను రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోనికి వస్తుంది. నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టి, నాలుగు కప్పుల నీటిలో 15 నిమిషాలు ఉడికించి చలార్చాలి. తర్వాత నీటిని వడకట్టి, ఆ నీటిలో దూదిని ముంచి ఆ నీటిని మొటిమలపై అద్దాలి.

ఒక టేబుల్ స్పూన్ మెంతులను టేబుల్ స్పూన్ నీటితో కలిపి ఒక పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్ ను ముఖంపై పట్టించాలి. ఇలా తరచూ చేస్తే మెంతులలోని జిగురుగా ఉండే పదార్ధం వల్ల ముఖం పొడిబారడం తగ్గి మృదువుగా అవుతుంది. మెంతి ఆకులు నూరి ముద్దలో కొంచెం నెయ్యి కలిపి ఉడికించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాచిన గడ్డలపై కడితే వాపు, గడ్డ తగ్గుతాయి. ఓ గ్లాస్ నీటిలో టీ స్పూన్ పరిమాణంలో మెంతులను నానబెట్టి వాటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి.

మెంతిపొడి పావుగ్లాసు నీళ్లతో మరగనిచ్చి చల్లారిన తరువాత తీసుకుంటే గొంతులో కఫం తగ్గి, జలుబు, దగ్గు తగ్గుతాయి. ఒక స్పూను మెంతులు, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లల్లో నానబెట్టి ఉదయం పరగడుపున తాగడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు.

8. పెట్రోలియం జెల్లీ

పొడి, పగిలిన చర్మం నుండి చర్మపు దద్దుర్లు మరియు పూతల వరకు దాదాపు ప్రతి చర్మసమస్యకు పెట్రోలియం జెల్లీని ఉపయోగిస్తాము. చిన్న కోతలు మరియు కాలిన గాయాలకు చికిత్సగా పెట్రోలియం జెల్లీని ప్రతిచోటా వాడతారు. ముక్కు నుండి రక్తస్రావం జరిగినా, జలుబు చేసినా కూడా, దీనిని చికిత్సకు ఉపయోగిస్తారు.

పెట్రోలియం జెల్లీని చాఫింగ్, డైపర్ రాష్ కోసం, మాయిశ్చరైజర్‌గా, తామర వంటి చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

 

Exit mobile version