మోరింగా టీ వలన ఎన్ని లాభాలో తెలుసా ?

మన దైనందిన జీవితంలో టీ ఒక భాగం అయిపోయింది. ఈ ప్రపంచంలో చాలా టీలు ఉన్నాయి. ఒక్కో టీది ఒక్కో ప్రత్యేకత. కొందరైతే పొద్దున లేస్తే పాలతో చేసిన టీ తాగనిదే ఏ పనీ చేయలేరు. చాలామంది రకరకాల టీలను తాగుతున్నారు. ఎవరికి నచ్చిన టీని వాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మధ్య గ్రీన్ టీలు, లెమన్ టీలు, ఇతర టీలు బాగా ప్రాచుర్యం పొందాయి. హెర్బల్ టీలలో తాజాగా ఇపుడు మోరింగా టీ ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారణం ఈ టీని సేవించడం వల్ల ఎన్నో ప్రయజాలుండటమే. మోరింగా అంటే మరేమిటో కాదు మునగాకులతో చేసిన టీ. మునక్కాయలు వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తామని తెలిసిందే. దీంతో వంటలకు సువానలతో పాటు రుచికి రుచి, మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుంది.

benefits of moringa teaమునక్కాయలను ఎక్కువగా పప్పు, చారు, సాంబారు, కూర, పచ్చడి ఇలా ఎన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మునగకాయలనే కాకుండా మునగ ఆకును కూడా వంటల్లో వాడతారు. అయితే, కాయలు వాడినంతగా ఆకును మాత్రం వాడరు. కానీ, మునగ ఆకు కూడా ఆరోగ్యానికి మరింత మంచిది.

benefits of moringa teaఇది కాలేయంలో చేరిన విష పధార్థాలను బయటికి పంపిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది. ఈ ఆకులతో చేసిన టీని తాగితే బరువు తగ్గించుకోవచ్చు. రక్తపోటును అదుపులో వుంచుంది. రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది. కొవ్వులు చేరకుండా అడ్డుకుంటుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.

benefits of moringa tea
మునక్కాయలతో టీ తయారు చేసుకోవడం పెద్ద కష్టమైనదేమి కాదు. ఈ రోజుల్లో మోరింగా పౌడర్ ఆన్‌లైన్‌లో, కిరాణా దుకాణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. దీనిని ఫిల్టర్ చేసిన నీటిలో ఉడకబెట్టి, ఆపై ఒడపోసి టీని పొందవచ్చు, ఇదే మోరింగా టీ. ఒకవేళ బ్రాండ్లు, ప్యాకేజ్డ్ పౌడర్‌లపై నమ్మకం లేకపోతే ఇంట్లో మోరింగా పౌడర్‌ను కూడా తయారు చేసుకోవచ్చు.దీని కోసం చేయవలసిందల్లా కొన్ని తాజా మునగ ఆకులను తీసుకోవాలి. వాటిని డీహైడ్రేట్ చేసి, ఆపై వాటిని పొడి చేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత దానిని ఉడకబెట్టాలి. తరువాత వడకట్టి తీస్తే అదే మోరింగా టీ. కానీ మునగాకు పౌడర్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే.. దాన్ని నేరుగా తీసుకోవటం, ఇష్టమైన ఆహారాలు లేదా డ్రింక్స్‌తో కలిపి తీసుకోవడం మంచిది.

benefits of moringa teaమునగాకు పొడిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. ఇది అద్భుతమైన మూలికా సప్లిమెంట్. చాలామంది దీనిని పోషక పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఉబ్బసం లక్షణాలను తగ్గించడం నుండి తల్లిలో పాల ఉత్పత్తిని పెంచడం వరకూ ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. మునగాకు పొడి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

benefits of moringa teaతద్వారా ఇది అధికంగా గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా మునగాకు టీతో తాగడం అలవాటు చేసుకుంటే ఒబిసిటీ తగ్గడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

benefits of moringa teaఅయితే అందుబాటులో ఉందని ఈ టీని ఆషామాషీగా తాగేయకూడదు. ఏదయినా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే మాత్రం ఖచ్చితంగా డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ టీ తీసుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR