తేగలను తీసుకోడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

చలికాలం ముగుస్తూ వేసవి ప్రారంభమవుతుందనగా తేగలు వచ్చేస్తాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో తాటి గేగులు అని కూడా అంటారు. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. సీజనల్ ఫుడ్ అయినటువంటి ఈ తేగలను తీసుకుంటే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి.

benefits of taking tribesతేగలు బ్లడ్ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి వీటికున్నాయి, దీనికి కారణం ఇందులోని పీచు పదార్థమే. ఈ పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పతుతుంది. పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తుంది. టాక్సిన్లను తొలగిస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి. ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి.

benefits of taking tribesతేగల్లో ఆరోగ్య పోషకాలు పుష్కలంగా వున్నాయి. తేగలను బాగా ఉడికించి మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్ధాలతో పాటు పిండి పదార్ధం కూడా పుష్కలంగా లభిస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పిండి కొట్టి, కొబ్బరిపాలు, బెల్లం, ఏలకుల పొడి చేర్చి తీసుకుంటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది.

benefits of taking tribesతేగల పిండిని గోధుమ పిండిలా మెత్తగా చేసి రొట్టెల్లా చేసుకుని తినొచ్చు. ఇందులో పీచు, క్యాల్షియం, ఫాస్పరస్, ధాతువులు, ఒమేగా-3 పుష్కలంగా వున్నాయి. అలాగే పొటాషియం, విటమిన్ బి, బి1, బి3, సి వంటివి కూడా వున్నాయి. తేగలు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా మేలు చేస్తాయి.

ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలోని తెల్లకణాలను వృద్ధిచేస్తుంది.

benefits of taking tribesఆకలిని నియంత్రించే శక్తి తేగలకు వుండటంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు శరీరానికి చలవనిచ్చి నోటిపూతను తగ్గిస్తుంది.

benefits of taking tribesతేగలను పాలలో ఉడికించి ఆపాలను చర్మానికి పూతలా వేసుకుంటే చర్మానికి చాలా మేలు చేస్తుంది. అలాగే తేగలను ఎక్కువగా తీసుకోకూడదని రోజుకు రెండు తినాలని వారానికి ఐదారు తీసుకోవచ్చునని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR