గుండెదడ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసా ?

మారిన జీవనశైలి వల్ల కూడా ఈ మధ్య యువతరంలో గుండె జబ్బులు ఎక్కువగా చూస్తున్నాం. జంక్‌ఫుడ్‌, కొలెస్ట్రాల్‌, ఉప్పు ఎక్కువున్న ఆహారం అతిగా తీసుకుంటున్నారు. కేలరీలు అధికంగా ఉండే శీతల పానీయాలు తీసుకోడం ఎక్కువైంది. శారీరక శ్రమ తగ్గింది. ఎక్కడికి వెళ్లినా, వాహనాలపైనే వెళుతున్నారు. వ్యాయామం బాగా తగ్గింది. తీసు కున్న ఆహారం అంతా కొవ్వుగా మారుతోంది.

causes of heart attackఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాల వల్ల గుండె జబ్బులు ఎక్కువగా చూస్తున్నాం. ప్రస్తుతం పని ఒత్తిడి, లక్ష్యాలు చేరుకోవడంలో ఆందోళన వంటి కారణాల వల్ల యువకుల్లో కూడా గుండె దడ వస్తుంది. ఇది థైరాయిడ్‌ వల్ల కూడా రావచ్చు. గుండెదడను ఆంగ్లంలో పాల్పిటేషన్స్ అని వ్యవహరిస్తారు. గుండె దడ అంటే గుండె తనంతట తానే వేగంగా కొట్టుకొంటున్నట్లు అనిపిస్తుంది.

causes of heart attackసాధారణంగా ఆందోళనగా ఉన్నప్పుడు, వ్యాయామం తరువాత కొందరిలో ఇది కొంతసేపు ఉంటుంది. కానీ గుండెదడ చాలాకాలంగా నిరంతరంగా కొనసాగేటట్లయితే దానివలన వచ్చే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని మొదటి దశలోనే గుర్తించి తగిన చికిత్స చేయించుకోవాలి. అసలు ఈ గుండెదడ రావడానికి గల కారణాలు తెలుసుకుందాం.

మానసిక ఒత్తిడి : మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన సమయంలో గుండెదడ వస్తుంది.

రక్తహీనత : దీనివలన శరీర కణజాలానికి ప్రాణవాయువు సరఫరా తగ్గి, దానిమూలంగా ఆయాసం, గుండెదడ వస్తాయి. ముఖ్యంగా అధిక శ్రమ చేసినప్పుడు గుండెనొప్పి కూడా వచ్చే అవకాశం వుంటుంది.

causes of heart attackవిటమిన్ లోపాలు : విటమిన్ బి లోపం వల్ల వచ్చే బెరిబెరి అనే వ్యాధిలో కూడా గుండెదడ రావచ్చు.

థైరాయిడ్ గ్రంధి వ్యాధులు : థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పనిచేసే హైపర్ థైరాయిడిజం లో అనూహ్యమైన రీతిలో బరువు తగ్గి, విరేచనాలు, ఆకలి ఎక్కువగా వేయడం, గుండెదడ కనిపిస్తాయి.

causes of heart attackమెనోపాజ్ సమస్యలు : కొందరు స్త్రీలలో బహిష్టులాగిపోయే దశలో హార్మోన్ ల విడుదలలో లోపం ఏర్పడడం వలన రక్తప్రసరణ గతి తప్పి గుండెదడ ఏర్పడుతుంది.

causes of heart attackమందుల దుష్ఫలితాలు : ఉబ్బసం కోసం వాడే కొన్ని మందులు గుండెదడను కలిగించే అవకాశం వుంది. గుండె జబ్బులు : గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమవడం, గుండె కండరాలు బలహీనమవడం వంటి స్థితులలో గుండెదడ రావచ్చు.

causes of heart attackఅలాగే.. ఎక్కువగా పరిగెత్తినా.. ఎక్కువ వ్యాయామం చేసినా కూడా గుండె దడ వస్తుంటుంది. ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకున్నా కూడా గుండె దడ పెరుగుతుంటుంది. ఒక్కోసారి గుండె కొట్టుకోవాల్సిన వేగం కన్నా తక్కువగా కూడా కొట్టుకుంటుంది. ఒక్కోసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఆ సమయంలోనే గుండె దడ దడగా ఉంటుంది. దానికి కారణం.. హార్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో వచ్చే మార్పులు. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందట.

causes of heart attackహార్ట్ ఎలక్ట్రికల్ సిస్టం లో ఉండే ఈ మార్పులు వలన అబ్నార్మల్ హాట్ బిట్స్, రిథమ్స్ జరుగుతాయి. ఈ రిధమ్స్ ని Arrhythmias అని అంటారు. అయితే వీటిలో కొన్ని పూర్తి ఆరోగ్యం పైన ప్రభావం చూపవు. అయితే కొన్ని మాత్రం జీవితాన్నే ఇబ్బందిలోకి నెట్టి ప్రమాదకరంగా మార్చేస్తుంది అని నిపుణులు చెప్పారు.

Arrhythmiasలో రెండు రకాలు ఉన్నాయి.

టాకీకార్డియా :

మొదటి దానిలో నిమిషానికి వంద సార్లు గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే గుండె వేగంగా కొట్టుకుంటుందో అప్పుడు జరుగుతుంది. అయితే వీటిలో కొన్ని వాటిని సులువుగా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ కొన్ని వాటిని ట్రీట్మెంట్ చేయడం కష్టం. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణానికే ప్రమాదమని నిపుణులు చెప్పడం జరిగింది.

causes of heart attackబ్రాడీకార్డియా

ఇది రెండవ రకం. ఇక్కడ గుండె నిమిషానికి 60 సార్లు కంటే తక్కువ కొట్టుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే గుండె చాలా నెమ్మదిగా కొట్టుకుంటుందో అటువంటి సందర్భంలో ఇది జరుగుతుంది అని నిపుణులు చెప్పారు. ఎప్పుడైతే బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా వుండవు అటువంటి సమయంలో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

causes of heart attackఅందుకే.. గుండె దడను ఆపాలంటే.. జీవన విధానంలో మార్పు రావాలి. ఒత్తిడిని జయించాలి. ఎక్కువగా యాంగ్జయిటీకి గురి కాకూడదు. మెడిటేషన్, యోగా ఎక్కువగా చేయాలి. కనీసం రోజుకు 20 నిమిషాల పాటు.. ఏదైనా వ్యాయామం చేయాలి. ఇలా.. క్రమం తప్పకుండా చేస్తూ ఉండే.. గుండె దడ సమస్యను తగ్గించుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR