Home Health స్కిన్ టైట్ దుస్తులు ధరించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలుసా

స్కిన్ టైట్ దుస్తులు ధరించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలుసా

0

యువత ఫ్యాషన్ కి పెద్ద పీఠ వేయడం కొత్త విషయమేమి కాదు. మారుతున్నా జీవనశైలి కారణంగా ఫ్యాషన్ పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరూ చూడ్డానికి అందంగా కనిపించాలని దుస్తులను టైట్‌గా వేసుకోవడం అలవాటు అయిపోయింది. కొద్దిగా వదులుగా ఉన్నా ఆ డ్రెస్సెస్‌ని వేసుకోవడానికి అంతగా ఇష్టపడడం లేదు. కానీ ఇలా వేసుకుంటే చూడ్డానికి బాగానే ఉన్నా దీని వల్ల వచ్చే ఇబ్బందులు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

dangers of wearing skin tight clothesఒంటికి అతుక్కుని ఉండే డ్రెస్సులతో అనేక ఇబ్బందులు ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.. అంతేకాదు వీటిని వేసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సులువుగా కూర్చోలేం, మన పనులు మనం చేసుకోలేము అంతే కాదు ఇలాంటి దుస్తులు ధరించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

నరాలపై ప్రభావం :

శరీరానికి అతుక్కుని ఉండే డ్రెస్సులతో అనేక ఇబ్బందులు ఉంటాయి. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.. అంతే కాదు, వీటిని వేసుకున్నప్పుడు కూడా మనకి చాలా ఇబ్బందిగా ఉంటాయి. చాలా సందర్భాల్లో ఊపిరి ఆడడం కూడా కాస్తా ఇబ్బందిగా ఉంటుంది. కూర్చోవడం, నిల్చోవడం, నడవడం ఇలా ప్రతి ఒక్క పని చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి మరీ కష్టంగా ఉంటుంది, వారికి కాళ్ళు రాసుకుపోవడం, తొడ భాగాల్లో నొప్పులు రావడం, దీని వల్ల నరాలపై ఒత్తిడి పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది రానురాను మరిన్నీ సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి వదులుగా ఉన్న బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

కండరాలు, వెన్నునొప్పి వచ్చే అవకాశాలు :

వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది. అంతే కాదు, ఆ ప్రభావం వెన్నుపూసపై కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా స్కిన్ టైట్, షార్ట్స్ వేసుకున్నప్పుడు కండరాలు, జాయింట్స్ పట్టేసినట్లుగా ఉంటాయి. దీంతో.. బాడీ పెయిన్స్ పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు.

సంతాన సమస్యలు :

టైట్ డ్రెస్సులు, లో దుస్తులు వేసుకోవడం వల్ల సంతాన సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని వేసుకోవడం వల్ల మగవారిలో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా, క్రోమోజోమ్‌ల సంఖ్య తక్కువ అవుతాయని. దీని వల్ల సంతాన సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి అలాంటి బిగుతుగా ఉండే బట్టలు ధరించకపోవడమే మంచిది.

క్యాన్సర్ వచ్చే అవకాశం :

పరిశోధనల ప్రకారం టైట్‌గా ఉండే లోదుస్తులు వేసుకోవడం వల్ల శరీరంలో ముఖ్య భాగాలపై ఎఫెక్ట్ పడుతుంది. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అనేక మందిని పరీక్షించిన అనంతరం ఈ విషయాన్ని తేల్చారు పరిశోధకులు.

ఫంగల్ ఇన్ఫెక్షన్స్ :

టైట్‌గా ఉన్న డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల కామన్‌గా వచ్చే సమస్య ఏంటంటే.. ఫంగల్ ఇన్ఫెక్షన్స్.. ముఖ్యంగా ఇన్నర్ వేర్ వేసుకోవడం వల్ల శరీర అంతర్భాగాల ఇన్ఫెక్షన్స్‌కి కారణంగా మారతాయి. ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. యోని ప్రాంతాల్లో మంట, దురద వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి లోదుస్తులు ఎప్పుడు కూడా సరైనవి ఎంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా.. మరీ లూజ్‌గా ఉన్నవి కూడా వేసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు. మరీ టైట్‌ కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా కంఫర్టేబుల్‌గా ఉండేవి ఎంచుకోవడం మంచిది.

 

Exit mobile version