Home Health దాల్చిన చెక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

దాల్చిన చెక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

0

దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన బెరడును ఎండబెట్టి, కట్టలా చుడతారు. అదే మనకు దొరికే దాల్చిన చెక్క. ఇవి చక్కని సుగంధాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా మనం వంటకాలలో ఉపయోగిస్తాము. మాంసాహార, శాకాహార వంటకాల్లో సువాసన కోసం వాడే “దాల్చిన చెక్క” మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది.

health benefits of cinnamonఅయితే మనకు తెలియని మరో విషయం ఏమిటంటే మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు.

->దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు పట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది.

->దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల అది కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను మర్దన చేయడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

->దాల్చిన చెక్క నూనె చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుందని, అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునేముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతుంటారు.

->దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

->దాల్చిన చెక్కలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యలను, చిగుళ్ళ వ్యాదులను, నోటి పుండ్లను నివారించడంలో గొప్ప పాత్ర వహిస్తాయి. అందుకే దీన్ని మౌత్ ఫ్రెషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాల్చిన నూనె నోటిలోని బాక్టీరియాను నిరోధించి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

->దాల్చిన చెక్కలో అత్యధికంగా ఫ్లావనాయిడ్స్ మరియు ఇతర యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి, నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు (మెన్స్ట్రువల్ క్రామ్ప్స్) ను తగ్గిస్తుంది.

->గర్భవతులు కూడా కొద్ది మోతాదులో దాల్చిన చెక్కను తీసుకోవచ్చు. గర్భిణులలో అధిక రక్తపోటు సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. అయితే గర్భిణులు కేవలం డాక్టరు సలహా మేరకు మాత్రమే దీనిని తీసుకోవడం మంచిది.

 

Exit mobile version