పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రజల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెరిగింది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో గోధుమగడ్డి ముఖ్యమైనది. గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో ‘ఎ’ విటమిన్, బి కాంప్లెక్స, సి, ఇ, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియమ్, సోడియం, సల్ఫర్, కోబాల్ట్, జింక, క్లోరోఫిల్ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఒకగ్లాసు లోనే 17 ఎమినో యాసిడ్స్ ఫైబర్ ఎంజైమ్స్ ఉంటాయంటే ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరామో తెలుస్తుంది.
గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
2. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగవచ్చు.
3. గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
4. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు గోధుమ గడ్డిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులకు గాలి సరఫరాను క్రమబద్దీకరిస్తాయి. దీంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. అలర్జీలు రావు.
5. ప్రేగులు, జీర్ణాశయంలో అల్సర్లు ఉన్న వారు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది. ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. గోధుమగడ్డిలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే దాంతో క్లోరోఫిల్ శరీరంలోకి చేరి తద్వారా రక్తం పెరుగుతుంది. అనీమియా రాకుండా ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా ఇది ఎంతగానో మేలు చేస్తుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనోత్తేజం కలిగిస్తుంది.
7. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గించి మూడ్ మారుస్తాయి.
9. గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, బీటా కెరోటిన్, బయో ఫ్లావో నాయిడ్, బి, సి, ఇ విటమిన్ల కారణాన క్యాన్సర్ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.
10. ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కళ్ళ కింద నల్లటి వలయాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక్ పరిశ్రమ లో గోధుమగడ్డి రసాన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానిక్ గా పనిచేస్తుంది.