చేపనూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

మాంసాహారంలో మిగతావాటికంటే చేపలు శరీరానికి ఉత్తమ పొషకాల్ని అందిస్తాయి. గుండె జబ్బులను నివారించగల అద్భుత శక్తి చేపలకు ఉంటుంది. చేపల్లో మనకు అవసరమైన ఎనిమిది రకాల అమైనో యాసిడ్లు లభిస్తాయి. అంతేకాదు..చేప నూనెకూడా మనకు ఎంతగానో మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు.

health benefits of fish oilఅసలు చేప నూనె అంటే ఏమిటి, ఎక్కడనుండి వస్తుంది? అని కొందరికి సహజంగా వచ్చే అనుమానం. చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుండి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్డినెస్ మరియు అన్కోవిస్ అనే చేపల నుండి ఈ చేప నూనెని తీస్తారు. చేప నూనెతో ఇంకా ఎన్ని వ్యాధులను నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యము :

health benefits of fish oil

చేప నూనె గుండెజబ్బులను నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జీవక్రియలో ఇబ్బందులు ఉన్న మరియు గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవటం వల్ల చాలా లాభం పొందుతారు.

ఆస్టియో ఆర్థరైటిస్ ఉపశమనానికి :

ఒమేగా -3 చేప నూనె, ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క వివిధ రకాలు లక్షణాలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇది చేప నూనె వల్ల కలిగే ప్రయోజనాలలో ముఖ్యమైనది.

శోథ చికిత్స :

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఇకోసాపెంటాయెనోయిక్ యాసిడ్ (EPA) మరియు చేప నూనె లో డొకోసాహెక్సానాయిక్ యాసిడ్ (DHA), శోథ నిరోధకాలుగా పిలుస్తారు. ఇది కూడా చేప నూనె వల్ల కలిగే ప్రయోజనాలలో ఒకటి.

యాంటి ఏజింగ్ :

చేప నూనె యాంటి ఏజింగ్ ఔషధంగా అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటుంది . మీరు చేప నూనెను తీసుకోవటం వల్ల ,టెలోమేర్ తగ్గించే ప్రక్రియ ద్వారా మిమ్మలిని వయసులో చిన్నవారిగా కనపడేలా చేస్తుంది.

ఫ్యాట్ బర్నింగ్ :

health benefits of fish oilచేపనూనె మరియు వ్యాయామం – సమర్థవంతమైన బరువు తగ్గటం కోసం పరిపూర్ణమైనటువంటి సమ్మేళనం. చేప నూనెలో ఇకోసాపెంటాయెనోయిక్ యాసిడ్ (EPA) మరియు డొకోసాహెక్సానాయిక్ యాసిడ్ (DHA) ఉండటంవలన కొవ్వును తగ్గించటంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నది.

మెదడు చురుగ్గా పనిచేయటం :

health benefits of fish oilవిద్యార్థులు చేప నూనెను తీసుకోవటంవలన ఎక్కువ జ్ఞాపకశక్తి మరియు మెదడు చురుగ్గా పనిచేయటంలో చాలా దోహదపడుతుంది చేప నూనె తీసుకోవడం వల్ల జ్ఞాన నైపుణ్యాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారని నిరూపించబడింది.

క్యాన్సర్ ని తగ్గిస్తుంది :

health benefits of fish oilకీమోథెరపీ వలన క్యాన్సర్ రోగుల్లో కండరాల నష్టానికి ఎక్కువ అవకాశం ఉంది. చేప నూనె తీసుకోవటం వల్ల క్యాన్సర్ రోగుల్లో బలహీనపడిన కండరాలు కాపాడబడతాయి తద్వారా బరువు నష్టాన్ని తప్పించుకోగలుగుతారు.

ఎముకలు ధృడంగా అవుతాయి :

health benefits of fish oilచేప నూనె యొక్క ప్రముఖ ఆరోగ్య ప్రయోజనం ఎముకలను బలోపేతంగా చేయటం. ఒమేగా -3 కొవ్వు మరియు డొకోసాహెక్సానాయిక్ యాసిడ్ (DHA) ఎముకలను ఆరోగ్యంగా ఉంచటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

అధిక రక్తపోటు తగ్గించడం :

health benefits of fish oilచేప నూనె ప్రయోజనాలలో ముఖ్యమైనది ఇది, క్రమం తప్పకుండా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు తీసుకోవడం వల్ల నిర్దిష్టంగా అధిక రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది. చేప నూనెలో ఉండే డిహెచ్ఏలో కూడా ఈ లక్షణం ఉంటుంది.

సోరియాసిస్ :

health benefits of fish oilసోరియాసిస్ రోగులకు ఎంతో ఉపయోగరమైనది చేప నూనె. చేప నూనె వాడటం వల్ల కలిగే ప్రయోజనాలలో ఆసక్తికరమైనది ఏమిటంటే సోరియాసిస్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండ రోజూ చేప నూనె తీసుకుంటే ఆ వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు.

మధుమేహ వ్యాధి :

health benefits of fish oilమీరు ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ కారణంగా మధుమేహం కలిగి ఉంటే క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవటం వలన ప్రయోజనం పొందవొచ్చు. ఈ విధంగా చేయటంవల్ల రక్తంలో చక్కెర స్థాయిని సరిగా ఉంచుతుంది మరియు కండరాలలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మరియు కొవ్వు కణజాలాన్ని సరిగా ఉంచుతుంది.

ఒత్తిడి నుండి ఉపశమనం :

health benefits of fish oilమీ మానసిక ఆరోగ్యము సరిగా ఉంచడానికి ఒక సప్లిమెంట్ కావాలనుకుంటే మీ ప్రధాన ఎంపిక చేప నూనె అయి ఉండాలి. చేప నూనె వినియోగించే వారిలో ఆత్మహత్య ఆలోచనలు మరియు నిరాశ ఉండవని అధ్యయనాలు స్పష్టంగా చెపుతున్నాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR