అవిసె గింజలను వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?

భారతదేశంలోని గ్రామాలలో బరువు, కీళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు నయం చేయడానికి, పచ్చళ్ళు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. మన పూర్వీకులు ఈ అవిసెగింజలతో ఎన్నో వైద్యాలు చేసేవారు. ఇప్పటికీ బామ్మలు, అమ్మమ్మలు ఈ గింజలతో ఏవో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. మరి ఈ అవిసె గింజలను ఎలా తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం.

health benefits of flax seedsఅవిసె గింజలను 15 నిమిషాలు నానబెడితే మొలకలు వస్తాయి ఈ మొలకలు ఉదయాన్నే తింటే అవిసె గింజలల్లో ఉండే పూర్తిస్థాయి పోషకాలు మనకు అందుతాయి. అవిసె గింజ‌ల్లో అధికంగా ఉండే.. ‘ఒమెగా 3’ ఫ్యాటీ యాసిడ్లు గుండె స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూస్తాయి. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి. ఒక్క గుండె సమస్యలే కాదండోయ్! అవిసె గింజలతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

health benefits of flax seedsఅయితే అవిసె గింజలు తినడం వలన ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. వీటిలో పీచు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసె గింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని ఉదయం నీళ్లు తీసివేసి గింజలను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

health benefits of flax seedsఅవిసె గింజల్లో నీటిలో కరిగే, కరగని… రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడతాయి. కొవ్వు కరిగిస్తాయి. చక్కెర నిల్వలను తగ్గిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడిని పండ్ల రసంలో కలుపుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు. చికెన్, కోడిగుడ్లు వండినప్పుడు అందులో అవిసె గింజల పొడి వేయాలి. దీంతో ఆహారాన్ని తిన్నా బరువు తగ్గుతారు. ఓట్స్ ను ఉడికించి వాటిపై అవిసె గింజలు చల్లకుని తింటే బరువు తగ్గుతారు.

health benefits of flax seedsఅవిసె గింజ‌ల‌ను ఉద‌యాన్నే తింటే శ‌క్తి బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. కీళ్ల నొప్పులు కూడా పోతాయి. చేప‌లు తిన‌డం ఇష్టం లేనివారికి అవిసె గింజలు మంచి ప్రత్యామ్నాయం. అవిసె నూనె వాడితే ప్రొస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు. రేడియేషన్‌ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.

health benefits of flax seedsఅవిసె గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన చర్మం, జుట్టుతోపాటూ ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ప్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్ పై అవిసె గింజలు చల్లుకుని తింటే ఆరోగ్యం బావుంటుంది.

health benefits of flax seedsఅవిసెల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి సమ్యసలు ఉండవు. బ్రెడ్, కుకీస్ తిన్నప్పుడు మధ్యలో అవిసె గింజలు పెట్టుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. అవిసె గింజ జీవక్రియ రేటును పెంచి,. శరీరంలో శక్తి జనించేందుకు దోహదం చేస్తుంది. దీనివలన శరీరంలో వేడి పుడుతుంది. చలికాలం, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గును నివారించడానికి ఈ వేడి సహాయపడుతుంది.

health benefits of flax seedsఅవిసె గింజలను ప్రతీ రోజూ ఆహారంలో భాగంగా చేయడం వలన అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఏంటి ఇన్ఫ్లమేటరి గుణాలు రకరకాల ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడానికి దోహద పడతాయి, మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

health benefits of flax seedsఅలాగే అవిసె గింజల్లోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య మరియు సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి. అవి చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. కాలుష్య కారకాలు మీ చర్మ రంధ్రాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. చర్మం లోని తేమను అవి కాపాడతాయి. తద్వారా చర్మం పై ముడతలు పోతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR