అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

కరోనా దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం కలిగిస్తుంది. సెలబ్రిటీలను, దేశ అధినేతలను, సామాన్యులను ఎవర్ని వదలడం లేదు. అయితే ఇలాంటి సమయంలో డాక్టర్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్న సలహా ఒక్కటే. కరోనా వైరస్ ని మీరు జయించాలంటే చేయాల్సింది ఒక్కటే.. వీలైనంత వరకూ మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోండి అని సలహా ఇస్తున్నారు. బాడీలో ఎంతగా ఆంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో అంతకంటే ఎక్కువగా మనం కరోనా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో దొరికే వస్తువుతో రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఅల్లం దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉంటుంది. కూరలో ప్రతి ఒక్కరూ అల్లం ఉపయోగిస్తారు. దాదాపు చాలా మందికి అల్లంతో ఉండే ఉపయోగాలు తెలిసినవే. ఎందుకంటే పురాతన కాలం నుండి మనవాళ్లు ఆయుర్వేద పద్ధతిలో అల్లం యొక్క ఉపయోగాలను చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లాన్ని ఎంత ఎక్కువగాతీసుకుంటే అంత మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అలాగని ఎక్కువ మోతాదులో కాదు మితంగా తీసుకోవాలి అని కూడా చెబుతున్నారు. సో ఇప్పుడు అల్లం తో మనం ఏం చేయగలమో ఆ టిప్స్ తెలుసుకుందాం.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుకరోనా లక్షణాలలో ముఖ్యమైనవి గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం. అల్లంతో తయారుచేసే అల్లం టీ తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు, జ్వరం, తలనొప్పితో భాదపడేవారికి ఉపశమనం కలుగుతుంది.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుచాలా మందికి ఉదయాన్నే వేడి వేడి టీ గొంతులో పడితే గానీ మనసు ఊరుకోదు. ఉత్సాహంగా కూడా పనిచేస్తారు. టీకి అల్లం జోడిస్తే ఆరోగ్యానికి మంచిది కూడా. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రయాణాలలో కడుపు తిప్పే వారికి, వాంతులు అయ్యే వారికి అల్లం టీ ఇస్తే ఉపశమనం కలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తేన్పులు, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా అల్లం టీ చాలా మంచిది.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే సమస్యలకు అల్లం టీ దివ్యాఔషధంగా పనిచేస్తుంది. అప్పుడు వచ్చే నొప్పి దూరం అవుతుంది. దీనిని రోజూ త్రాగితే మరీ మంచిది.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు40 దాటిన వ్యక్తులకు నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు కూడా అల్లం టీ తాగవచ్చు. జలుబు, జ్వరం ఉన్నవారు అల్లం టీ త్రాగాలి.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుమెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ప్రశాంతత కోసం అల్లంటీని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు సీజనల్ వ్యాధులకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఅధిక బరువుని తగ్గించే శక్తి కూడా అల్లంటీకి ఉంది. చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, దీని వల్ల వచ్చే గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఅల్లం మధుమేహం రాకుండా కాపాడుతుంది ,ఇన్సులిన్ మోతాదును సరిగ్గా ఉంచుతుంది , సహజమయిన నొప్పి నివారిణి అల్లం ,కాన్సర్ రాకుండా కాపాడుతుంది

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుకావాల్సిన పదార్థాలు :

1 కప్పు నీరు, 1 అంగుళం అల్లం యొక్క, 1 టీస్పూన్ టీ ఆకు, కొద్దిగా తేనె.

తయారీ విధానం:

1 కప్పు నీరు బాణలిలో వేసి వేడి చేయాలి. 1 అంగుళం అల్లం ముక్కను చూర్ణం చేసి నీటిలో కలపండి. నీరు మరిగే సమయంలో మంటను తక్కువ చేసి 1 నిమిషం పాటు వేచి చూడండి. ఆ తర్వాత నీటిలో టీ ఆకులు వేసి మరిగించాలి. ఆ ద్రవాన్ని వడకట్టండి. దానిలో తేనె, లేదా చక్కెర వేసి బాగా కలపండి మీ అల్లం టీ సిద్ధమవుతుంది. క్రమం తప్పకుండా ఈ టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అల్లం తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఅల్లం టీ నిమ్మరసం, తేనె కాంబినేషన్ లో కూడా ఆరోగ్యానికి చాలామంచిది. అల్లం పసుపు కాంబినేషన్ కూడా చాలా సమస్యల నుండి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR