దబ్బపండు రసంతో ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసా ?

దబ్బపండు సిట్రస్ జాతికి చెందిన మొక్క. పంపరపనస, నారింజ పండ్ల మధ్య సహజంగా జరిగిన సంకరీకణ ద్వారా పుట్టినదే దబ్బపండు. నారింజ పండుకు బదులుగా దీనిని వాడవచ్చు. ఇవి మన శరీరములో అధికముగా కల వాత దోషములను పోగొడుతుంది. ఇందులో విటమిన్ “C” ఎక్కువగా ఉంటుంది. ఇది బయోఫ్లేవనాయిడ్స్ అధికంగా కలిగి ఉంటుంది. వేసవికాలంలో దబ్బపండు రసంను తేనెతో కలిపి స్వీకరించుట వలన వంటిలోని వేడిని తగ్గిస్తుంది.

దబ్బపండుఅతిసారము, విరేచనములు, కాలేయ సంబందిత వ్యాధుల నివారణలో దబ్బపండు ఎంతగానో ఉపకరిస్తుంది. దబ్బపండులో యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువ. అందుకే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులూ చెబుతున్నారు. దబ్బకాయ రసాన్ని రోజూ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గువంటి వ్యాధులు దరిచేరవు.

దబ్బపండుదబ్బపండుతో పచ్చడి చేసుకుంటారు. లేదంటే పులిహోర చేస్తారు. 100 గ్రాముల దబ్బకాయ గుజ్జులో 42 కేలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్‌ తగ్గేందుకూ సహకరిస్తుంది. 100 గ్రా. తాజా పండులో 135 మి.గ్రా. పొటాషియం ఉంటుంది.

దబ్బపండుగుండె వేగాన్ని నియంత్రించేందుకూ, రక్తపోటు అదుపు చేసేందుకూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది మహిళలకు, ముఖ్యంగా పిల్లలకి కడుపులో నులిపురుగులు చేరి ఇబ్బందిపెడతాయి. అలాంటప్పుడు దబ్బ రసంలో వాము, జీలకర్ర కలిపి తీసుకుంటే వాటికి చెక్‌ పెట్టొచ్చు. ఈ పండును రోజూ తింటే జుట్టు బాగా పెరిగి, రాలే సమస్య నియంత్రణలోకి వస్తుంది. త్వరగా తెల్లజుట్టు రాకుండా ఆపుతుంది.

దబ్బపండుఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. ఎరుపు రంగులో ఉండే గ్రేప్ ఫ్రూట్లో లికోపిన్ ఉండటం వల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్ కారక ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి లైకోపీన్ ఎక్కువ. లియోనాయిడ్ల గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి.

దబ్బపండువీటితోపాటు, లైకోపిన్‌, బీటా కెరోటిన్‌, క్సాంథిన్‌, ల్యూటిన్‌… వంటి ఫ్లేవొనాయిడ్‌లూ ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్‌ లభిస్తుంది. ఇది ఊబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుంది.

దబ్బపండుదబ్బకాయ షర్బత్‌ చాలా మంచిది. వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి. దబ్బకాయలో ఉండే విటమిన్‌ సీ, మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్‌, నారింజిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

దబ్బపండుఇది సహజమైన క్లెన్సర్‌ కూడా. దీని గుజ్జుని చర్మం మీద నెమ్మదిగా రుద్దితే మృతకణాలన్నీ తొలగి, నిగారింపుని తీసుకొస్తుంది. ఖరీదైన ఫేస్ క్రీములను గమనిస్తే వాటిల్లో హైడ్రాక్సీ ఆమ్లాలుంటాయి. అవన్నీ సహజంగానే దబ్బపండులో ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వయసును పైబడనివ్వదని పరిశోధనలలో తేలింది.

దబ్బపండుఇంటిని శుభ్రపరచేందుకు అధ్భుతంగా పనికొస్తుంది. మూడొంతుల వేడినీళ్ళలో ఒక వంతు వినెగర్ను, ఒకవంతు దబ్బపండు రసాన్ని కలిపితే చాలు బాత్రూమ్, టబ్లూ సింక్స్, కిచెన్, టైల్స్ అన్నీ శుభ్రం చేసుకోవచ్చు. అయితే దీన్ని భోజనం తరవాతే తీసుకోవాలి గానీ పరగడుపునే వద్దంటున్నారు నిపుణులు. అదీ నిత్యం మందులు వాడేవాళ్లు వాటితో కలిపి తీసుకోకూడదనీ హెచ్చరిస్తున్నారు. నిజానికి ఎలాంటి సిట్రస్‌ పండయినా భోజనానికీ భోజనానికీ మధ్యలో తీసుకోవడమే మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR