అశ్వగంధ ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలుసా ?

0
202

అశ్వగంధకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇండియా, నార్త్ ఆఫ్రికా లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఆయుర్వేదంలో ఇది చాలా ప్రముఖ మూలిక. ప్రస్తుతం జరుగుతున్న రీసెర్చ్ ద్వారా అశ్వగంధ కొవిడ్-19 రాకుండా, వచ్చాక మందుగా పనిచేస్తుంది.

health benefits of horseradishఐఐటీ-ఢిల్లీ, జపాన్ లోని ఎడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సైన్స్ ఎండ్ టెక్నాలజీ కలిసి చేసిన రీసెర్చ్ లో అశ్వగంధ, ప్రొపొలిస్‌లలోని గుణాలు కరోనా వైరస్ సోకకుండా చూస్తాయి. ప్రొపోలిస్‌లోని యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలో వ్యాధులతో పోరాడే లక్షణం కలిగి ఉంటాయి.

health benefits of horseradishకొవిడ్-19 కి వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ కి బదులుగా అశ్వగంధ వాడొచ్చా అని చూడడం కోసం భారత ప్రభుత్వం ఒక ట్రయల్ ని మొదలుపెట్టింది. అశ్వగంధ, యష్టిమధు, గుడూచి పిప్పలి, పాలిహెర్బల్ ఫార్ములేషన్ – ఈ నాలుగింటితో క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టారు. కరోనా వైరస్ కి ప్రత్యేకించి వ్యాక్సీన్ కానీ మందు కానీ లేకపోవడంతో రీసెర్చెర్స్ రకరకాల ఆప్షన్స్ గురించి ఆలోచిస్తున్నారు. చిన్న డోసుల్లో అశ్వగంధ చాలా మందికి సురక్షితమే. అయితే, గర్భిణీలు మాత్రం దీన్ని తీసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది అబార్షన్‌ని కారణమవుతుంది. అంతే కాక, దీని దీర్ఘకాలిక ప్రభావాలను ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.

కరోనా సంగతి పక్కన పెడితే అశ్వగంధ ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో చూద్దాం.

ఒత్తిడి తగ్గిస్తుంది

health benefits of horseradishఈ మూలిక ఒత్తిడినీ, ఆందోళననీ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. ఈ విషయం కొన్ని కంట్రోల్డ్ క్లినికల్ ట్రైల్స్ ద్వారా కూడా నిరూపితమైంది.

ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది

అశ్వగంధలో ఉన్న యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాల వల్ల ఈ మూలిక ఇన్‌ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. పైగా ఈ మూలిక శరీరంలో ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడే ఇమ్యూన్ సెల్స్ ని ప్రమోట్ చేస్తుంది.

బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది

health benefits of horseradishఅశ్వగంధ ఇన్సులిన్ సెన్సిటివిటీ ని అభివృద్ధి చేసి ఇన్సులిన్ విడుదలని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పైగా ఈ మూలిక డయబెటిస్ పేషెంట్స్‌లోనే కాదు, మామూలు వాళ్ళలో కూడ బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది

health benefits of horseradishకొలెస్ట్రాల్‌ని, బ్లడ్ ప్రెజర్ నీ తగ్గించడం ద్వారా అశ్వగంధ గుండెకి మేలు చేస్తుంది. జంతువుల మీద చేసిన పరిశోధనల్లో ఈ మూలిక టోటల్ కొలెస్ట్రాల్ నీ ట్రైగ్లిసరైడ్స్ నీ గణనీయంగా తగ్గిస్తుందని తెలిసింది. హై ట్రైగ్లిసరైడ్స్ హార్ట్ డిసీజెస్ కీ స్ట్రోక్ కీ కారణమవుతాయి.

కాన్సర్ తో పోరాడుతుంది

health benefits of horseradishఅశ్వగంధ కొన్ని రకాల కాన్సర్లు రాకుండా చేస్తుంది. వాటిలో బ్రెస్ట్, కలోన్, లంగ్, బ్రెయిన్, ఒవేరియన్ కాన్సర్లు ఉన్నాయి. జంతువుల మీదా చేసిన పరిశోధనల్లోనూ, టెస్ట్-ట్యూబ్ స్టడీస్ లోనూ ఈ మూలిక ట్యూమర్ గ్రోత్ ని అరికట్టగలదని తెలిసింది.

health benefits of horseradishఅశ్వగంధ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో సందేహం లేదు. కానీ, మీ డాక్టర్ రికమెండ్ చేసిన మెడిసిన్స్ బదులుగా మాత్రం దీన్ని వాడకూడదు. డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

 

SHARE