పనసపండును, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇది మొరాసి కుటుంబానికి చెందిన చెట్టు. ఈ చెట్టు యొక్క పండు ఉష్ణమండల వాతావరణంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఇది పండినప్పుడు తీపి రుచిని కలిగి ఉంటుంది . లోపలి భాగం కండ కలిగి ఉంటుంది. కండకలిగిన భాగాన్ని బల్బ్ అని పిలుస్తారు. దీనిని అలాగే తినవచ్చు లేదా వివిధ వంటకాల్లో కూడా ఉపయోగించవచ్చు. పనసకాయ ఇంకా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు, అంటే ఇంకా ముగ్గనప్పుడు కోడి మాంసపు ఆకృతిని పోలి ఉంటుంది, పనసకాయను శాఖాహారులకు మాంసం ప్రత్యామ్నాయంగా చేస్తుంది. పనసను ఉప్పునీరు ద్రావణంలో కలిపి కేండ్ (canned) ఆహరంగా కూడా తయారు చేస్తారు. దీనిని కొన్నిసార్లు కూరగాయ మాంసం అని కూడా పిలుస్తారు.
బయటకు భయానకంగా కనిపించినా.. దాని లోపల ఉండే తొనలు నోరూరిస్తాయి. ఈ పండు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది. ఎన్నో ఔషద గుణాలు కలిగిన ఈ పండు కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే తప్పకుండా పనస తినండి. ఈ పండు తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఇవి పనిచేస్తాయి. దగ్గు, జలుబు వంటి అనేక వ్యాధులను తొలగించడానికి ఉపయోగపడతాయి.
మలబద్ధకం నివారణ :
జాక్‌ఫ్రూట్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. జాక్‌ఫ్రూట్ తినడం ద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తపోటు నియంత్రణ కోసం :
ఇందులో పొటాషియం, సోడియం, విటమిన్ సి, బి 6 ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది :
ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఎముకలను బలంగా చేస్తుంది :
జాక్‌ఫ్రూట్‌లో మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి పనిచేస్తాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
రక్తహీనత నుండి కాపాడుతుంది :
జాక్‌ఫ్రూట్‌లో అధిక ఐరన్ ఉంటుంది. రక్తహీనతను నివారించడానికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో రక్త వృద్ధి జరుగుతుంది.
ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం :
జాక్‌ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం ముడతలు, పొడిబారడాన్ని తొలగిస్తాయి. ఇందులో విటమిన్ సి, నీరు అధికంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
కళ్ళ ఆరోగ్యానికి మేలు :
జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళకు మేలు చేస్తుంది. కంటిశుక్లం, రేచీకటి వంటి కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :
జాక్‌ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మం, పెద్దప్రేగు, నోటి క్యాన్సర్ మొదలైన వాటిని నివారించడంలో ఇవి సహాయపడతాయి. ఇందులో విటమిన్ కె ఫైబర్, మాంగనీస్ ఉంటాయి. ఇది ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
వీర్యకణాలను వృద్ధి చేస్తుంది :
పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. .
తీసుకోవలసిన జాగ్రత్తలు :
పనసలో రక్తాన్ని గడ్డకట్టించే లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని శస్త్రచికిత్స చేయించుకునే వారిని, ఇతర రక్త సంబంధిత రోగాలు ఉన్నవారిని తినకూడదని చెబుతుంటారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులలో గ్లూకోస్ స్థాయిని పెంచే గుణం పనసకు ఉంటుంది, కనుక మధుమేహం ఉన్నవారు ఈ పండును మితంగా తింటే మంచిది.