లస్సీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

వేసవి వచ్చిందంటే చాలు భానుడి భగ భగలు తట్టుకోవడానికి ఆపసోపాలూ పడుతుంటాం. భానుడి తాపాన్ని తట్టుకునేందుకు పండ్లరసాలు, మజ్జిగ, పుదీనా నీళ్లు, పుచ్చకాయలు.. అంటూ రకరకాల చలువ మార్గాలు వెతుక్కుంటాం. భగభగ మండే భానుడి వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల శీతల పానీయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కమర్షియల్ డ్రింక్స్ కన్నా ఆరోగ్యాన్ని పెంపొందించే పానీయాలనే ఎంపిక చేసుకోవడం ఉత్తమం. సరిగ్గా అలాంటి కోవకే చెందినది లస్సీ.

health benefits of lassiనిజానికి లస్సీ సంప్రదాయం ఉత్తరాది వాళ్లది. కానీ ఇప్పుడు, దక్షిణాది ప్రజల నోరూ ఊరిస్తోంది. ఒకప్పుడు పంజాబీ ‘లస్సీ’ ఫేమస్‌. పంజాబీల లస్సీ దుకాణాలు ఎండాకాలం కిటకిటలాడేవి. ఇప్పుడిప్పుడే ట్రెండ్‌ మారుతున్నది. పంజాబీ లస్సీకి ఏ మాత్రం తీసిపోని రుచితో స్థానికుల చేతుల్లోనే అద్భుతంగా తయారవుతున్నది. వేసవి తాపాన్ని తీర్చి, శరీరాన్ని చల్లబరిచే గుణం లస్సీలో అపారం.

health benefits of lassiమనదేశంలో అందరూ పెరుగు రెగ్యులర్‌గా వాడుతారు కానీ లస్సీని ఎండాకాలం మాత్రమే వాడుతుంటారు. అయితే పంజాబీలు మాత్రం లస్సీని రోజూ వాడుతారు. ఎందుకంటే దానితో కలిగే ప్రయోజనాలు వాళ్లకు బాగా తెలుసు. గడ్డ పెరుగును చిలికి కాస్తంత చక్కెర, నాలుగు చుక్కల రోజ్‌ మిల్క్‌ కలిపి, పైనుంచి మీగడ వేసి సర్వ్‌ చేసే ప్లెయిన్‌ లస్సీతోపాటు పండ్లు, కూరగాయలు, సబ్జా గింజలు, పుదీనా.. ఇలా ఇష్టమైన ఫ్లేవర్లు నోరూరిస్తున్నాయి.

health benefits of lassiలస్సీలో ఓ రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది మనం తినే ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. రోజూ లస్సీ తాగితే అజీర్తి సమస్యే ఉండదు. అదే కాదు జీర్ణానికి సంబంధించి కలిగే అన్ని రకాల అనారోగ్యాలనూ లస్సీ పోగొట్టగలదు.

health benefits of lassiపెరుగుతో చేసే లస్సీలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌లాంటి ఆవశ్యక మూలకాలతోపాటు ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ సమ్మేళనాలు బీపీని నియంత్రిస్తాయి. కాబట్టి, రక్తపోటు ఉన్నవాళ్లూ తీసుకోవచ్చు.

health benefits of lassiచల్లటి లస్సీ తాగితే వేసవి తాపం నుంచి విముక్తి పొందడమే కాదు..మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంలోనూ ఇది తోడ్పడుతుంది. వేసవి సీజన్ లో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి లస్సీ తాగడం వల్ల శరీరంలోని నీటి స్థాయిలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. లస్సీలోని ఎలక్ట్రోలైట్స్‌, నీరు శరీరం మొత్తాన్నీ తేమగా ఉంచడానికి సాయపడుతాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.

health benefits of lassiమొలాసెస్ నుంచి తయారుచేసే లస్సీ తాగితే అది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. పొట్టలో అనారోగ్యాలు, గ్యాస్ ఇతరత్రా సమస్యలు పరిష్కారం అవుతాయి. సన్నగా ఉన్న వారు బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో శరీరానికి కావాల్సిన కొవ్వులు, క్యాలరీలు ఉంటాయి.

health benefits of lassiపెరుగులోని పోషకాలు రోగ నిరోధకతను పెంచుతాయి. జింక్‌ శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాదు, దీనినుంచి అందే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు రోజూ లస్సీ తీసుకోవచ్చు. దీంతో తక్షణ శక్తి లభించడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

health benefits of lassiకారం, మసాలాలు తీసుకోవడం వల్ల ఎండకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. దాంతో కడుపులో మంట తగ్గేందుకు లస్సీ మంచి మందులా పనిచేస్తుంది. అజీర్తి, కడుపులో మంట, మలబద్ధకం, ఎసిడిటీ.. వంటి సమస్యలన్నిటినీ తగ్గించే శక్తి లస్సీకి ఉంది. అలాగే, విరోచనాలతో బాధపడేవారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

health benefits of lassiబాడీలో వేడి పెరిగితే ప్రమాదం అది క్రమంగా జలుబు, దగ్గు, జ్వరానికి దారి తీస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత లస్సీ తాగితే శరీరంలో వేడి బ్యాలెన్స్ అవుతూ చలవ చేస్తుంది. సమ్మర్‌లోనే కాదు… ఎప్పుడైనా సరే అలసిపోయినట్లుగా అనిపిస్తే వెంటనే లస్సీ తాగండి. ఈ రోజుల్లో లస్సీ రెడీమేడ్‌గా దొరుకుతోంది. ఇంట్లో తయారుచేసుకునే లస్సీ చాలా మంచిది. అలా వీలుకానప్పుడు మాత్రమే రెడీమేడ్ లస్సీ తాగడం మేలు. లస్సీలో కాల్షియం, ప్రోటీన్స్ ఉంటాయి.

health benefits of lassiలస్సీలో లాక్టిన్ , విటమిన్ D ఉంటాయి. అవి మీ ఇమ్యూనిటీని పెంచుతాయి. మీ ఎముకలకు బలాన్ని ఇస్తాయి. అడ్డమైన వైరస్‌లు బాడీలోకి రాకుండా చేస్తాయి. పాల పదార్థాలతో తయారుచేసే లస్సీలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లస్సీ తాగినట్లైతే ఎముకలు స్ట్రాంగ్ గా తయారవుతాయి.

health benefits of lassiఇది శరీరానికి అవసరమయ్యే బ్యాక్టీరియాను మాత్రమే మన దేహంలో ఉంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపేందుకు లస్సీ సహాయపడుతుంది. శరీరానికి తక్షణ శక్తినిచ్చే పానీయం కాబట్టి, అలసిపోయినప్పుడు శ్రమ ఎక్కువైనప్పుడు దీన్ని తాగితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

health benefits of lassiకొంత మందికి పొట్టలో గడబిడ ఉంటుంది. అలాగే ఏం తిన్నా అది అరగకుండా పీక దగ్గరే ఉన్న ఫీల్ కలుగుతుంది. వారికి రొమ్ము దగ్గర మంటలా అనిపిస్తుంది, ఇక యాసీడీటీ సమస్యలు ఉండనే ఉంటాయి. వీటన్నింటికీ సరైన పరిష్కారం లస్సీ.

health benefits of lassiఒకవేళ వేడి చేసినపుడు లస్సీ రెడీగా లేదని అనుకుంటే కనీసం పెరుగో, మజ్జిగో తాగడం మేలు. లస్సీలో ఉండే గుణాలు చాలా వరకు పెరుగులోనూ ఉంటాయి. అందువల్ల ఈ వేసవిలో ఏదో ఒకటి మిస్సవకుండా వాడుతూ ఉంటే ఆరోగ్యమే.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR