మామిడి పువ్వుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

భారతీయ సాంప్రదాయంలో మామిడి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మామిడి ఆకుల తోరణం ఉత్తమమైన తోరణంగా విశ్వసిస్తారు. ప్రతి పండుగ లేక శుభకార్యం కాని మామిడి తోరణం తోటే ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమంలో మామిడి ఆకులు చోటు చేసుకుంటాయి.

మామిడి పువ్వుఫలాల్లోనే రారాజుగా నిలిచిన మామిడిలో పోషక విలువలు కూడా ఎక్కువే. న్యూట్రీషినల్ విలువలున్న మామిడి పండ్లతో ఎన్నో రకాల వెరైటీస్ చేయొచ్చు. మరియు పోషకాలు కూడా ఎక్కువే. అయితే మామిడి పువ్వుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

మామిడి పువ్వుదంతాలకు, చిగుళ్లకు బలాన్నివ్వడంతో పాటు నోటిపూతకు దివ్యౌషధంగా పనిచేస్తుంది మామిడి పూత.

మామిడి పువ్వుమామిడి పువ్వుల్లో ధాతువులు, విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మామిడి పండ్లలోని ధాతువులు ఇందులోనూ వున్నాయి. గొంతులో నొప్పి ఏర్పడితే మామిడి పువ్వులను తెచ్చుకుని శుభ్రం చేసి.. నీటిలో మరిగించి ఆపై వడగట్టుకోవాలి. ఆ మిశ్రమంలో కాస్త నిమ్మరసం చేర్చి తీసుకుంటే గొంతునొప్పి వుండదు.

మామిడి పువ్వుఎండిన మామిడి పువ్వులను ధూపంలో వేస్తే దోమలువుండవు. మామిడి పువ్వులు, జీలకర్రను సమభాగంలో తీసుకుని.. ఎండిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను రోజూ అర స్పూన్ మేర తీసుకుంటే.. మూల వ్యాధి నయం అవుతుంది.

మామిడి పువ్వుముఖ్యంగా మామిడి పువ్వులు డయాబెటిస్ పేషెంట్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మామిడి పువ్వులు, నేరేడు గింజలను సమానంగా తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రోజూ ఈ మిశ్రమాన్ని ఓ స్పూన్ పరగడుపున వేడినీటితో తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మామిడి పువ్వువేడితో ఏర్పడే ఉదర రుగ్మతలను కూడా మామిడి పువ్వులు నయం చేస్తాయి. ఎండబెట్టిన మామిడి పువ్వులను బాగా పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తీసుకుంటే నోటిపూత ఏర్పడదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR