పువ్వుల్లో అందమైన పువ్వు గులాబీ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ గులాబీ అందానికే కాదు ఔషధంగా కూడా మేలు చేస్తుంది. గులాబీలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్కి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.
వేసవి తాపం తీర్చుకునేందుకు కేవలం 10 గ్రాముల లోపు గులాబీ ద్రవాన్ని తీసుకుంటే మేలు కలుగుతుంది.
గులాబీ రెక్కల నుండి తీసిన రసంతో గులాబ్-జల్‌ని కూడా తయారుచేస్తారు. ఇది కంటి జబ్బులకి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
గర్భిణులు దీనిని రెండు మోతాదులుగా తీసుకుంటే వారిలోని ఉష్ణం తగ్గుముఖం పడుతుంది.
గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది.
గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టు కుంటే మెదడు చల్లబడటమేకాక జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.
ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీ స్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయం, సాయంకాలాలు ప్రయోగించి మర్థనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో హితకరంగా కూడా ఉంటుంది.
గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా తింటూ ఉంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.