ఉత్తరేణి మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

ఉత్తరేణి లేదా అపామార్గం ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయ నామం అఖిరాంథస్ ఆస్పరా. ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. వినాయక చవితి నాడు చేసే పత్ర పూజలో దీనిని ఉపయోగిస్తారు. సకల రోగ నివారణిగా పేర్కొంటూ ఈ మొక్కలకు అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో ఉంది. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం అఖిరాంథస్‌ ఆస్పరా.

health benefits of Uttareni plantఉత్తరేణీకి పురాణ కధల్లో ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వృత్తాసురుడు అనే రాక్షసుడ్ని చంపిన ఇంద్రుడు, ఆపై సముచి అనే మరో రాక్షసుడ్ని చంపేందుకు ఆతనితో స్నేహాన్ని నటిస్తూ అదను చూసి సమూచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తలని నరికేస్తాడు. దీంతో తెగి పడిన ఆ తల మిత్ర ద్రోహి అంటూ ఇంద్రుడ్ని తరమటం ప్రారంభించడంతో దాని నుండి తప్పించుకునేందుకు బృహస్పతిని కలిసి తరుణోపాయం చెప్పమంటే రాజసూయ యాగంలో భాగంగా చేసే ఉత్తరణీ ధాన్యం వాడి చేసే యాగాన్ని చేయమంటాడు. దీంతో యాగమాచరించిన ఇంద్రుడుని ఉత్తరేణి సముచికి కనబడకుండా చేస్తుంది. ఈ ప్రక్రియని అపామార్గం అంటారు. దీని వల్లే ఉత్తరేణిని అపామార్గ మొక్కలని కూడా పిలుస్తారు.

health benefits of Uttareni plantభారత దేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఉత్తరేణీని గుండ్రని కాండాన్ని, అభి ముఖ ప్రత విన్యాసంతో దీర్ఘ వృత్తాకారంలో, లేదా వృత్తాకార ఆకులని కలిగి ఎరుపు, తెలుపు రంగులున్న పొడువాటి కంకులని కలిగి ఉంటుంది. ఈ మొక్కని ఆయుర్వేద మందుల తయారీకి వాడుతారు.

health benefits of Uttareni plantఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్త స్రావం కాకుండా చూస్తుంది. అలాగే దురదలు, పొక్కులు, శరీరం పై పొట్టు రాలటం జరుగుతుంటే ఈ రసం శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు తగ్గుతాయి. అలాగే కందిరీగ లు, తేనెటీగలు, తేళ్లు తదితరాలు కుట్టినప్పుడు ఆయా ప్రాంతాలలో ఈ ఆకులను ముద్దగా నూరి పెడితే నొప్పి, దురద తగుతాయి.

health benefits of Uttareni plantఉత్తరేణి గింజల్ని పొడిచేసి, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం కల్పిన మిశ్రమం వాడితే పంటి నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారటం తదితర సమస్యలు తగ్గి దంతాలు మెరుస్తుంటాయి. ఈ మొక్క లని కాల్చిన తరువాత వచ్చే బూడిదకు కాస్త ఆముదం కల్పి గజ్జి, తామర, తదితరాలపై లేపనంగా పూస్తే తగ్గుతాయి. అలాగే ఈ బూడిదని తేనెలో కల్పి తీసుకుంటే ఉబ్బసం, దగ్గు తదితరాలతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులలోని శ్లేష్మం తగ్గుతాయి.

మజ్జిగలో కల్పి తీసుకుంటే రక్త విరేచనాలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే పౌరుష గ్రంధి వాపు సమస్యకు ఉత్తరేణీ చూర్ణానికి ఆవునెయ్యి కల్పి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

health benefits of Uttareni plantఉత్తరేణీ వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి, అందులో మిరియాల పొడి కల్పి రెండు పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలు సమసి పోతాయి.

నువ్వుల నూనెలో ఉత్తరేణీ రసాన్నిపోసి బాగా మరిగించాక ఆ నూనెని ప్రతి రోజూ పొట్టపై మర్ధన చేసుకుంటే కొవ్వుకరిగి సాధారణ స్ధితికి వస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR