వాల్నట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా ?

పోషకాలు ఎక్కువ ఉండే ఆహారాన్ని శరీరానికి తగిన మోతాదులో తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. శరీరానికి తగిన పోషకాలు అందించడంలో వాల్నట్స్ ముందుంటాయి. తెలుగులో వీటినే అక్రోట్లని అంటారు. ఇవి పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అప్పుడు వాటి పాముఖ్యతను మనకు అర్థంకాకపోయినా వాటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఓమేగా-3ని అందించే ఏకైక మొక్క ఆధారిత ఆహారం ఈ వాల్నట్సే.

వాల్నట్స్నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక ఔన్సు వాల్నట్స్‌లో 4 గ్రాముల ప్రోటీన్లు, 2 గ్రాముల ఫైబర్, ఇంకా ఎక్కువ మోతాదులో మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, విటమిన్-బీ లాంటి ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుడా ఎంయూఎఫ్ఐ, ఓమేగా-3 లాంటి ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా దొరుకుతాయి. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్నట్స్యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్లో వాల్నట్స్ ముందు వరుసలో ఉంటాయి. వాల్నట్స్ జీర్ణసంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. జీవక్రియ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. “వాల్నట్స్ పేగు సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. అందుకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను పెంచే ప్రీబయోటిక్ లక్షణాల మంచి ఎంపిక అని పోషకాహార నిపుణులు అంటున్నారు.

వాల్నట్స్శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం చాలా అవసరం. దీని కోసం, ఆరోగ్యకరమైన రక్తనాళాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, వాల్నట్ నూనె వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి, వాల్‌నట్స్‌లో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది, వాల్నట్ నూనె తీసుకోవడం వలన రక్తపోటును నియంత్రనలో ఉంచి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

వాల్నట్స్ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అత్యధికంగా అందించే వాటిలో నట్స్ లో వాల్నట్స్ ఒకటి. ఇవి మెదడు పనితీరును మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించే గింజల జాబితాలో “వాల్నట్” ప్రథమ స్థానంలో ఉన్నది. జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో బాగా ఉపయోగపడుతుంది. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు మరియు ఇతర జ్ఞాపకశక్తికి సంబంధించి ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా నిరాశకు లోనుకావడం, కుంగిపోవడం లాంటి లక్షణాలను తగ్గించి మనసుకు ప్రశాంతతను చేకుస్తాయి.

వాల్నట్స్వాల్నట్ ఆయిల్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందటానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది ఆరు రకాల బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది. వాల్నట్ ఆయిల్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉందని ఒక పరిశోధన కనుగొంది, ఇది ఇన్ఫెక్షన్ల వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

వాల్నట్స్వాల్నట్స్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గే అవకాశముంది. ఇవి ఆకలిని తగ్గించేస్తాయి. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఈ నూనెను మీ వ్యాయామములోనూ మరియు తీసుకునే ఆహారంలోనూ ఒక భాగంగా చేసుకోవడం వల్ల, మీ పొట్ట భాగంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించటంలో బాగా సహాయపడుతుంది. వీటిని చిరుతిండిగా తీసుకుంటే ఇంకా మంచిది. సలాడ్లలో వీటిని తినవచ్చు. లేదా అరటి, మామిడి జ్యూస్ ల్లో పొడిగా వేసుకొని తీసుకోవచ్చు. అంతేకాకుండా పచ్చి వాల్నట్స్ ను కూడా తినవచ్చు. వీటి పోషకాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆరోగ్యంగా ఉండేదుకు సాస్ ల్లోనూ వేసుకుని తినవచ్చు.

వాల్నట్స్వాల్నట్ ఆయిల్ అనేది మన చర్మంపైన చాలా అద్భుతాలను చేస్తుంటుంది. వాల్నట్ ఆయిల్ అనేది చర్మ కణాలను ఉత్పత్తి చెయ్యటంలోనూ మరియు టోనర్గా కూడా ఉపయోగించబడుతుంది. ఈ నూనెను తరచుగా కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను పోగట్టడానికి, కళ్ళలో ఉన్న నిస్తేజాన్ని మరియు వాపులను పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఈ నూనెను కళ్ల చుట్టూ ఉన్న ముడతలను తగ్గించడానికే కాకుండా, కంటి సౌందర్యానికి ఆటంకాలుగా ఉన్న ఇతర సమస్యలను నివారించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

వాల్నట్స్ఈ నూనె, బయట పరిస్థితుల వల్ల పొడిగా మారిన మీ చర్మాన్ని బాగా శుభ్రపరచి, మరింత కాంతివంతంగా చెయ్యటంలో మీకు బాగా దోహదపడుతుంది. చర్మం పై నెలకొన్న మచ్చలను నివారించడానికి మరియు చర్మానికి కావల్సినంత పోషణను అందించి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, అకాలంగా వచ్చే వృద్ధాప్య ఛాయల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ నూనె కూడా చర్మరోగాలైన సోరియాసిస్ మరియు తామర వంటి వాటికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

వాల్నట్స్వాల్నట్ అయిల్ను జుట్టు సమస్యల కోసం కూడా ఉపయోగిస్తారు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను గొప్ప స్థాయిలో కలిగి ఉన్న ఈ వాల్నట్ ఆయిల్, శరీర కణాలకు నష్టాన్ని చేకూర్చే అవాంతరాలను నిరోధిస్తుంది, తద్వారా జుట్టుకు నష్టం వాటిల్లకుండా ఎదుర్కోవటానికి బాగా సహాయపడుతుంది. ఇది తలపై చర్మానికి సరైన పోషణను అందించడమే కాకుండా, మచ్చలను మరియు చుండ్రును నిరోధించడంలోనూ సహాయపడుతుంది. ఈ నూనెను ప్రతిరోజూ ఉపయోగించటం వల్ల ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వాల్నట్ అయిల్ను వాడకం వల్ల మీకు మరింత మృదువైన మరియు మెరిసే జుట్టును ఇస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR