పుచ్చకాయలు వలన ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏంటో తెలుసా

ఖర్బూజ, పుచ్చకాయ వేసవిలో ఎక్కువగా కనిపించే పండ్లు. రుచికి మాత్రమే ఇవి ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. పుచ్చ‌కాయ‌లో 92 శాతం నీరే ఉండ‌టం వ‌ల్ల ఎండ వేడి నుంచి శ‌రీరానికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. శ‌రీరంలో వాట‌ర్ లెవ‌ల్స్‌తో పాటు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గిపోకుండా ఉండేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.

health risks of watermelonsమిగిలిన 8 శాతంలోనూ విట‌మిన్ ఏ, బీ1, బీ6, స‌2, పొటాషియం, మెగ్నీషియం, బ‌యోటిన్‌, కాప‌ర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలను అందిస్తాయి. బాడీలో వాటర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు డాక్టర్లు.

health risks of watermelonsపుచ్చ‌కాయ రోజూ తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది. కొన్ని ర‌కాల కేన్స‌ర్ వ్యాధుల‌ను నిరోధించే ల‌క్ష‌ణాలు కూడా ఉన్న‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. క‌ళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డంలో పుచ్చ‌కాయ స‌హాయ‌ప‌డుతుంది. ఇందులో ఉండే విట‌మిన్ ఏ.. క‌ళ్ల రెటీనాలో పింగ్మెంట్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అలాగే వేస‌విలో కంటి ఇన్ఫెక్ష‌న్ల‌ను నివారిస్తుంది. పుచ్చ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సీ.. జుట్టును అందంగా, బ‌లంగా మారుస్తుంది.

health risks of watermelonsఅయితే వీటిని ఎక్కువగా తినడం సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం, కొన్ని ఆహారాలను కలిపి తినడం మన కడుపు పనితీరును ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. పుచ్చకాయ పండ్లలో నీరు, తీపి మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి, కాబట్టి మనం తిన్న తర్వాత నీరు ఎక్కువగా త్రాగితే, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

health risks of watermelonsఅంతేకాదు పుచ్చకాయను రాత్రిపూట తినకూడదని అంటున్నారు. ఈ పండు జీర్ణక్రియను డిస్టర్బ్ చేసి రాత్రి సమయంలో కడుపుకి కష్టం కలిగిస్తుంది. జీర్ణక్రియ సాధారణంగా రాత్రి వేళల్లో మందగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో తీపి మరియు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండండి. సహజమైన స్వీటెనర్లలో పుచ్చకాయ పండు ఎక్కువగా ఉంటుంది మరియు శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు, రాత్రిపూట తీపి మరియు ఆమ్ల ఆహారాన్ని తీసుకుంటే, మన నిద్ర ప్రభావితం అవుతుంది.

health risks of watermelonsపుచ్చకాయలో నీరు, ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి అతిగా తినడం వల్ల అతిసారం వస్తుందని కొందరు ఫార్మకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలో సోర్బిటాల్ అనే పదార్ధం ఉంటుంది. తగినంత పరిమాణంలో తీసుకుంటే ఇది సమస్య కాదు కాని అతిగా తినడం వల్ల అతిసారం, గ్యాస్ ప్రాబ్లెమ్ వస్తుంది. కాబట్టి ఈ సీజన్ లో పుచ్చకాయలను తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR