Home Health మెదడు క్యాన్సర్ యొక్క ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

మెదడు క్యాన్సర్ యొక్క ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

0

క్యాన్సర్ పేరు వింటేనే భయపడుతుంటాం. అందులో మెదడుకు క్యాన్సర్ వచ్చిందంటే ఇక ఆందోళనే! డాక్టర్లు కూడా బ్రెయిన్ క్యాన్సర్‌కి సర్జరీ చేయడమే మొట్టమొదటి మార్గంగా ఎంచుకుంటారు. ఆరోగ్యకరమైన కణజాలం ప్రభావితం అయ్యే అవకాశాలుండడమే ఇందుకు కారణం.

causes of brain cancerబ్రెయిన్ క్యాన్సర్ అనేది మెదడులో దాపురించే ఓ అసాధారణ కణిత పెరుగుదల. ఓ అనియంత్రిత విభాగానికి చెందిన జీవ కణాల పెరుగుదలే మెదడులో ఏర్పడే గడ్డ. మెదడులోని అన్ని కణితులు మెదడు క్యాన్సర్ గా మారవు. మెదడు క్యాన్సర్ రెండు రకాలుగా ఉంటుంది. మెదడు కాన్సర్ లక్షణాలు మెదడులోని ఏ భాగానికి ఈ కాన్సర్ వ్యాధి సోకిందన్న దానిపై ఆధారపడి ఉంటాయి.

తలనొప్పి తరచుగా రావడం మెదడు కాన్సర్ కణితి యొక్క మొదటి లక్షణం. ఈ తలనొప్పి తేలికపాటి స్థాయి నుంచి తీవ్రమైన, నిరంతర స్థాయి వరకూ ఉండచ్చు లేదా అప్పుడప్పుడూ వస్తూండవచ్చు. మాట్లాడటంలో కష్టం, మూర్చ, వికారం, మగత మరియు వాంతులు, శరీరం యొక్క ఒక వైపు బలహీనత లేదా పక్షవాతం, పదాల్ని గుర్తుకు తెచ్చుకోవడంలో కష్టపడడం, బలహీనమైన దృష్టి, వినికిడి, వాసన లేదా రుచి లేకపోవడం మెదడు కాన్సర్ లక్షణాలు.

మెదడు క్యాన్సర్ యొక్క ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం.

మెదడు క్యాన్సర్ కు గల కారణాలు తెలియదు మరియు తెలిసిన కారణాలు అనిర్దిష్టమైనవి. అయితే, మెదడు క్యాన్సర్తో సంబంధం ఉన్న కొన్ని ప్రమాద కారకాలు ఇలా ఉన్నాయి.

వయస్సు పెరుగుదలతో పాటు మెదడు క్యాన్సర్ ప్రమాదం పెరగవచ్చు. అధిక మోతాదుల్లో రేడియేషన్ కిరణాలకు గురికావడం కూడా మెదడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

పిల్లల్లో మునుపటి క్యాన్సర్ చరిత్ర ఉన్నట్లయితే వారిని తరువాత జీవితంలో వారు మెదడు క్యాన్సర్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ల్యుకేమియా లేదా హడ్జ్కిన్ కాని లేదా లింఫోమా యొక్క చరిత్ర కలిగిన పెద్దలకు మెదడు క్యాన్సర్ దాపురించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మెదడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాల్లో అనుకూల కుటుంబ చరిత్ర (positive family history) మరియు కొన్ని జన్యు పరిస్థితులు కూడా ఉన్నాయి.

Exit mobile version