దేవాలయానికి వెళ్ళటంవల్ల అనేక ఉపయోగాలు ఏంటో తెలుసా ?

0
412

కొంతమందికి గుడికి వెళ్ళటం ఎంతో ఇష్టం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండటానికి దేవాలయానికి వెళ్తుంటారు. కానీ చాలామందికి దేవాలయానికి వెళ్ళాలంటే అదో పెద్ద పనిష్ మెంట్ కింద అనుకుంటారు. మనసులో దేవుడంటే భక్తి వున్నా, నమ్మకం వున్నా, సరే దేవాలయానికి వెళ్ళటమంటే అదో పెద్ద పనిగా బధ్ధకిస్తారు. పైగా దేవుడు మనలోనే వున్నాడు, మనింట్లోనూ వున్నాడు, ఎక్కడపడితే అక్కడ వున్నాడు
మళ్ళీ గుడిదాకా వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలా అని వాదిస్తారు. అలాంటివారికి ఒక్కటే సమాధానం. దేవాలయానికి వెళ్ళటంవల్ల అనేక ఉపయోగాలు వున్నాయి. అందుకని తప్పనిసరిగా వెళ్ళాలి.

Devathaluదేవాలయాలలో విగ్రహ ప్రతిష్ట సమయంలో కొన్ని యంత్రాలనుకూడా స్ధాపిస్తారు. వాటికీ, రోజూ పూజలందుకునే భగవంతుడికీ కొంత శక్తి వుంటుంది. మనం దైవ దర్శనం చేసుకున్నప్పుడు ఆ శక్తి మనకందుతుంది. ఇంక అభయముద్రతో వున్న దైవ స్వరూపాన్ని చూసేసరికి మానసిక ప్రశాంతత ఏర్పడి, మన జీవితంలో మనల్ని ఆదుకునేవారున్నారు అనే నమ్మకం, తద్వారా మనో బలం లభిస్తాయి. ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది. ఆలయంలో పైన వుండే కలశంద్వారా ప్రాణ శక్తి ఆ ఆవరణనీ, అందులోకి వెళ్ళినవారినీ ఉత్తేజ భరితుల్ని చేస్తుంది. ఈ విధంగా రకరకాల శక్తుల ప్రభావం అక్కడికెళ్ళినవారిమీద పడటంతో వారిలోని అనేక పాపాలు, దోషాలు పరిహరింపబడతాయి.

Templeకొత్త ప్రదేశాలలో ఆలయాలకి వెళ్ళినప్పుడు అక్కడ చారిత్రాత్మక విషయాలు, పురాణగాధలు, అంతకుముందు అక్కడ నివసించిన మహనీయులు, అక్కడివారి ఆచార వ్యవహారాలు, శిల్ప కళలో వైవిధ్యాలు, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

Templeఇంట్లోనే వుంటే కుండలో నీటిలాగా ఒక పరిధిలోనే వుంటాయి మన ఆలోచనలు. ఇలా, ఏ విధంగా చూసినా ఆలయ దర్శనం వల్ల ఎవరికైనా ఉపయోగమే. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

 

SHARE