సూర్య నమస్కారాల వల్ల జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా ?

ఎన్ని సంపదలు ఉన్నా మనిషికి ఆరోగ్యం ప్రధానం. అదే సరిగా లేకుంటే ఎన్ని ఉన్నా వృథానే. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన సంస్కృతిలో ఎన్నో ప్రక్రియలను మన పూర్వీకలు మనకు ఏర్పాటుచేశారు. యోగా, సూర్యనమస్కారాలు, నదీస్నానాలు, సముద్ర సానాలు, ఉపవాసాలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. అందులో అసలు ఖర్చులేకుండా ప్రతి ఒక్కరు ఆచరించడానికి వీలయ్యే వాటిలో సూర్యనమస్కారం ఒకటి.

Do you know the miracles of sun salutations?సూర్య నమస్కారాలు శారీరక, మానసిక ఆరోగ్యానికే కాక ఆధ్యాత్మికం గా కూడా హెల్ప్ చేస్తాయని అంటారు. సూర్య నమస్కారాల వల్ల వచ్చే అతి ముఖ్యమైన బెనిఫిట్ – డిసిప్లిన్. ఎలాంటి పనిలో ఉన్నా, ఎంత హడావిడిలో ఉన్నా పొద్దున్న ఒక్క పది నిమిషాలు కేటాయించుకోవటం ద్వారా ఒక షెడ్యూల్ ఏర్పడుతుంది. ఆ షెడ్యూల్ లైఫ్ కి ఒక స్టెబిలిటీని ఇస్తుంది. రెండవది, సూర్య నమస్కారాలని ఫుల్ బాడీ వర్కౌట్ గా చెప్పొచ్చు. ఒక ముప్ఫై నిమిషాల వర్కౌట్ తరువాత ఎన్ని క్యాలరీస్ తగ్గుతాయో తెలుసా? అరగంట వెయిట్ లిఫ్టింగ్ వల్ల 199 క్యాలరీస్, టెన్నిస్ వల్ల 232 క్యాలరీస్, ఫుట్ బాల్ వల్ల 298 క్యాలరీస్, రాక్ క్లైంబింగ్ వల్ల 364 క్యాలరీస్, రన్నింగ్ వల్ల 414 క్యాలరీస్ కానీ సూర్య నమస్కారాల వల్ల 417 క్యాలరీలు తగ్గుతాయి.

Do you know the miracles of sun salutations?పన్నెండు భంగిమలతో చేసే సూర్య నమస్కారాలు చాలా లాభాలు కలిగిస్తాయి. సాధారణంగా వివిధ ఆసనాలు, ప్రాణయామాలు చేసే వారు కూడా చివర్లోనో, మొదట్లోనో ఈ సూర్య నమస్కారాలు చేస్తుంటారు. అయితే, కేవలం సూర్య నమస్కారాలు చేసినా కూడా మనం ఊహించలేనన్ని లాభాలున్నాయంటున్నారు యోగా నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం…

Do you know the miracles of sun salutations?సూర్య నమస్కారాలు చేయటం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. ముఖంలో వర్ఛసు కలుగుతుంది. ఎందుకంటే, సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు ఒంటికి బాగా చెమటపడుతుంది. దీని వల్ల శరీరంలోని మలినాలు, విషతుల్యమైన పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి చర్మం, ముఖం కాంతివంతంగా తయారవుతాయి. సూర్య నమస్కారాలు చేసేప్పుడు తలలోకి రక్తం ప్రవహించేలా చేసే ఆసనాలు కూడా వుంటాయి. వాటి వల్ల మెదడులోకి ఎక్కువ రక్త ప్రసరణ జరిగి జుట్టు రాలటం, తెల్లబడటం తగ్గుతుంది.

Do you know the miracles of sun salutations?ఇక ఈ మధ్య కాలంలో చాలా మందిని సతమతం చేస్తున్న సమస్య అధిక బరువు. ఈ సమస్యకి కూడా సూర్య నమస్కారాలు గొప్ప పరిష్కారం. క్రమంగా సూర్యనమస్కారం చేస్తూ వుంటే శరీరం చక్కటి ఆకృతిలోకి వస్తుంది. వీటి వల్ల శరీరంలోని ప్రతీ అంగం, అవయవం ఒత్తిడికి లోనై, చురుగ్గా వుంటుంది. కొన్నాళ్లకి పొట్టతో సహా అన్ని చోట్లా వున్న అధిక కొవ్వు దానంతటదే కరిగిపోతుంది. సూర్య నమస్కారాల వలన పైపై లాభాలు మాత్రమే కాదు ఒంటి లోపల జరిగే కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.

సూర్య నమస్కారాలు…

  • బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.
  • మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తాయి.
  • ప్రీరియడ్ ప్రాబ్లంస్ నుండి రిలీఫ్ ని ఇస్తాయి.
  • బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి.
  • వెన్నెముక బలంగా తయారౌతుంది.
  • కాన్సంట్రేషన్, ఫోకస్ పెరుగుతాయి.
  • జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  • ఒత్తిడి తగ్గుతుంది.
  • చక్కగా నిద్ర పట్టేలా చేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR