ఏ దానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలుసా ?

శాస్త్రాలలో ధానాలకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎవరికైనా సంతానం లేకపోతే వారు దానాలు చేయాలనీ పెద్దలు చెబుతుంటారు. దానం కొద్ది బిడ్డలు అనే నానుడి కూడా ఉంది. అయితే ఎటువంటి దానం, దానాల్లో కెల్లా శ్రేష్ట్రమైనదో తెలుసుకుందాం.

దానంభూదానం, గోదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది అంటే చాలామంది ఘంటాపదంగా చెప్పే ఒకేఒక్క దానం. అన్నదానం. కాని నూటికి 90మంది చెప్పేవారే గాని చేయరు. మన సంప్రదాయాల కోసం వెతికే వారే కాని ఇది మన సంప్రదాయం అంటే మాత్రం ఆ నిజాన్ని జీర్ణించుకోలేరు.

భూదానం:

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే! దానాలన్నిటిలో కెల్లా గోప్పదానం భూదానం. ఇది తరతరాలను తరింపజేస్తుంది. ఏలోటు ఉండదు. ఎందుకంటే భూమిలో సువర్ణం,(బంగారం), భీజం(ఆహారం), నీరు, నిప్పు, పెట్రోలియం. ఇలా మానవ వనరులు మొత్తానికి ఆధారం భూమి మాత్రమే. చివరికి చనిపోతే పూడ్చి పెట్టాల్సింది కూడా ఈ భుమిలోనే.

సువర్ణదానం :

దానంఇది ఆయుష్షుని పెంచుతుంది. దీర్గాయువు ఇస్తుంది. రేపో మాపో చనిపోయేవారి పేరు మీద సువర్ణం దానం ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది.

గోదానం :

దానంశుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చట. మూడు రాత్రులు నేల మీద పడుకుని నీటిని తీసుకుంటూ దీక్ష చేసిన వారు గోవులను దానం చేస్తే మంచి ఫలితాలు వుంటాయని పురాణాలు చెబుతున్నాయి. చిన్న వయస్సులో మంచి ఆరోగ్యంతో వున్న ఆవును దానం చేస్తే ఆ ఆవుపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాలు పుణ్యలోకాల్లో వుండే వరాన్ని పొందవచ్చట.

అన్నదానం :

అన్నదానంఇది మనకి ఆహారం, వస్త్రం కొరతరాకుండా చేస్తుందని శాస్త్రం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,640,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR