Home Health నెయ్యి ఎక్కువగా తినడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసా ?

నెయ్యి ఎక్కువగా తినడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో తెలుసా ?

0

ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అవ్వగానే ఫుడ్ హాబిట్స్ మారాలి. ఏది మంచిదో, ఏది ఎంతవరకు తినాలో తెలుసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ప్రెగ్నెన్సీ టైం లో నెయ్యి తినచ్చా అని చాలామందికి డౌట్ వస్తుంది. వాస్తవానికి ఆయుర్వేదంలో నెయ్యి కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్వచ్చమైన ఆవు నేతిని కాచిన పాలలో కలిపి, అందులోనే ఒకట్ రెండు చుక్కలు కుంకుమ పువ్వు, మూడు నాలుగు చుక్కలు తేనె, చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే ఇమ్యూనీటీని బూస్ట్ చేసి, బేబీ యొక్క బ్రెయిన్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది.

problems like eating too much ghee?నెయ్యి తిన‌డం వ‌ల్ల ఆహారం తొంద‌ర‌గా అరుగుతుంది. ఇది మెట‌బాలిజంను బూస్ట్ చేస్తుంది. నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ఉన్నాయి. నెయ్యి తినేవారికి ఈ పోష‌కాల‌న్నీ ల‌భ్య‌మ‌వుతాయి. నాలుగవ నెల నుండి, బేబీ పుట్టే వరకూ కనీసం మూడు వందల క్యాలరీలు ఎక్కువ కావాలి. అప్పుడే బేబీ డెవలప్మెంట్ బావుంటుంది. కాబట్టి ఆహారంలో నెయ్యిని భాగం చేసుకుంటే బేబీ గ్రోత్ కీ బ్రెయిన్ డెవల్ప్మెంట్ కీ హెల్ప్ చేస్తుంది. అయితే నెయ్యి ఎక్కువగా తిన్నా కూడా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

నెయ్యి రోజుకి రెండు మూడు టీ స్పూన్స్ వరకు తీసుకుంటే ఏ హానీ లేదు. కానీ అంత కంటే ఎక్కువ అయితే మాత్రం తల్లీ, బిడ్డా కూడా బరువు పెరుగుతారు. ప్రెగ్నెన్సీ చివరి వారాల్లో ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా తగ్గుతుంది. అన్నీ కలిపి నార్మల్ డెలివరీ ని డిఫికల్ట్ చేయవచ్చు.

నెయ్యి ఎక్కువ తీసుకుంటే డెలివరీ తరువాత మామూలు బరువు కి రావడం కూడా కొంచెం కష్టమౌతుంది. ఒకవేళ సరైన బరువే ఉండి, తాజా పండ్లూ, కూరగాయలూ తీసుకుంటూ ఉన్నప్పుడు నెయ్యి తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ అది కూడా మితంగా తీసుకుంటేనే మంచిది.

 

Exit mobile version