ప్రస్తుత జీవనశైలిలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా ?

ఆరోగ్యమైన శరీరం అనేది మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పప్పులు, ఆకుకూరల్లో ఎన్ని పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయో మాంసాహారంతో కూడా అన్ని లాభాలు ఉన్నాయి. అయితే కొంతమంది శాకాహారమే ఆరోగ్యానికి మంచిదని చెబుతుండగా, మరికొంతమంది మాంసాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవనశైలిలో చాలామంది మాంసాహారాన్ని వదిలేసి శాకాహారాన్ని ఎంచుకుంటున్నారని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మరి వాస్తవానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం..

Meatమాంసాహారం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. దీనికి బదులుగా అన్నిరకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే హార్ట్ ఎటాక్, హార్ట్ స్ర్టోక్ ల బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అయితే గుండె ఆరోగ్యానికి మాంసాహారం కంటే శాకాహారమే మంచిదని ఖచ్చితంగా చెప్పే ఆధారాలేవి లేవు.

Vegetarianఇక క్యాన్సర్ కణాల అభివృద్ధికి మాంసాహారం కూడా కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శాకాహారం ఎక్కువగా తీసుకునేవారు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం తక్కువ.

Cancerఅంతేకాదు టైప్ 2 డయాబెటిస్ ని అదుపులో ఉంచడానికి ఆకుకూరలు, మొక్కల సంబంధిత శాకాహారం తోడ్పడుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. పండ్లు, కూరగాయలు, కాయలు, విత్తనాలు వంటి వాటిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ జీవక్రియల సమతుల్యాన్ని కాపాడుతుంది. దీంతో మధుమేహాన్ని సాధ్యమైనంత వరకు అదుపుతో ఉంచుకోవచ్చు. వీటితో పాటు మాంసాహారం తినేవారిలో బద్ధకం పెరుగుతుందని, జీర్ణక్రియ కూడా నెమ్మదిగా జరుగుతుందనే అనుమానాలతో శాకాహారులుగా మారిపోతున్నారు.

Diabetesఅయితే శాకాహారంలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, విటమిన్ డి, బి 12 వంటి కొన్ని రకాల విటమిన్లు, సూక్ష్మపోషకాలు కేవలం మాంసాహారం నుంచే లభిస్తాయి. ఎముక, కండరాల పెరుగుదల, అభివృద్ధికి ఈ మాంసకృత్తులు ఎంతో అవసరం. శాకాహారంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కేవలం శాకాహారమే తీసుకునేవారికి ఇలాంటి పోషకాలు అందక, పోషకాహార లోపం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వేగన్ డైట్‌ను ఎవరికి వారే సొంతంగా అలవాటు చేసుకోవడం మంచిది కాదు. మన జీవనశైలి, శరీర అవసరాలు, ఆరోగ్య పరిస్థితులు వంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR