Home Health శీతాకాలంలో ఎలాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలో తెలుసా ?

శీతాకాలంలో ఎలాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలో తెలుసా ?

0

సీజన్ మారుతుంటే ఆ పరిస్థితులను తట్టుకునేలా ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకుంటూ ఉండాలి. దానికి తగినట్టే సీజనల్ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి. ఆ ఫుడ్ తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. ఇక శీతాకాలం వచ్చింది అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా సీతాఫలం, అరటి, జామ, రేగిపండ్లు తీసుకోవాలి. ఇలాంటివి తీసుకుంటే జీర్ణక్రియ కాస్త నెమ్మదిగా ఉంటుంది.

Winter Foodకడుపుకి హెవీ అయిన ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. మరి శీతాకాలం ఏవి తినాలి, ఎలాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… శీతాకాలంలో రోజుకి ఓసారి టీ తీసుకోవచ్చు. కందిపప్పు మంచి ఐరెన్ ఫుడ్, ఇది వారానికి మూడు రోజులు తీసుకోవచ్చు. బాదం, పిస్తా వంటి నట్స్ లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు రోజులకి ఓసారి తీసుకోవచ్చు.

కారం ఎక్కువగా ఉన్న ఆహరం కూడా తీసుకోవచ్చు. ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు తీసుకోవచ్చు. జీర్ణశక్తి మందగించే ఆహారానికి దూరంగా ఉండాలి.

జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, పేస్ట్రీలు, బర్గర్లు, పిజ్జాలు వీటి జోలికి వెళ్లవద్దు.. అతి మసాలా తిన్నా ఈ శీతాకాలం సమస్యలు వస్తాయి.

 

Exit mobile version