Home Health ఆది శంకరాచార్యుల పొరపాటు వల్ల ప్రతిష్టింపబడిన అమ్మవారు

ఆది శంకరాచార్యుల పొరపాటు వల్ల ప్రతిష్టింపబడిన అమ్మవారు

0

ఆదిశంకరాచార్యలు అమ్మవారి కటాక్షం కోసం పూర్వం కుడజాద్రి పర్వతాలపై తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్ష్యం అయ్యారు. అప్పుడు శంకరాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని కోరుకోగా అందుకు ఆమె అంగీకరించింది. అతని వెనకే రావడానికి సిద్ధపడింది. అయితే ఆమె ఒక షరతు విధించింది. ఆ షరతు ప్రకారం ఆదిశంకరాచార్యులు వెనక్కి తిరిగి చూడకూడదని… ఒకవేళ అలా వెనక్కి తిరిగి చూస్తే.. చూసిన స్థలంలోనే స్థిరంగా వుండిపోతానని అమ్మవారు చెబుతుంది.

Kollur Mookambikaశంకరాచార్యులు ఈ షరతును అంగీకరించి ముందుకు వెళుతుండగా అమ్మవారు కూడా ఆయన్ని అనుసరించింది. అలా చాలాదూరం ప్రయాణించిన తరువాత కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి శబ్దం వినిపించకపోవడంతో శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూశారు. దాంతో తనకు ఇచ్చిన మాటను తప్పడంతో అక్కడే ప్రతిష్టించమని అమ్మవారు చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతోపాటు మూకాంబికా పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని పూర్వగాథ.

కర్నాటకలో వున్న ఏడు ముక్తి క్షేత్రాల్లో ఈ కొల్లూరు ఒకటి. కర్ణాటకలోని పడమటి కొండలలో వున్న అందమైన కొండలమధ్య కొల్లూరు ప్రాంతంలో అందమైన వృక్షల మధ్య మూకాంబికా క్షేత్రం వుంది. ఈ ఆలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని అంచనా. హరగల్లు వీర సంగయ్య అనే రాజు అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారని నిపుణులు చెప్పుకుంటున్నారు.

ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి వుండటం. ఆదిశంకరాచార్యాలువారు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించడంతో ఈ ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది. ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలు కూడా ఇక్కడ వున్నాయి. పూర్వం కర్నాటకను పాలించిన రాజులు అందరూ అమ్మవారికి విశేషమైన కానుకలను సమర్పించి, అర్చించారు. అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం కూడా వుంది. ఇది సింహద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే కుడివైపున వుంటుంది.

మూకాంబిక ఆలయంలో తేనెతో తయారుచేసే ‘‘పంచకడ్జాయం’’ అనే ప్రసాదాన్ని పెడతారు. దీనికి ఒక ప్రత్యేక కథ కూడా వుంది. పూర్వం అమ్మవారికి ప్రసాదం నివేదించిన తరువాత దానిని అక్కడే వున్న బావిలో వేసేవారట. ఇది చూసిన ఒక చదువురాని వ్యక్తి ప్రసాదం వేసేముందు బావిలో నీటి అడుగున దాక్కుని తిన్నాడట. దాంతో అతడు మహాపండితుడుగా మారిపొయ్యాడని అంటుంటారు.

ఇక్కడి ప్రజలకు అమ్మవారిపై అపార విశ్వాసం వుంది. ముకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగా మారి సంపన్నులుగా ఎదుగుతారని ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

 

Exit mobile version