బరువు తగ్గాలంటే ఎవరైనా తిండి తగ్గించమని చెబుతారు. కానీ ఇవి తింటేనే బరువు తగ్గిపోతారు. అవే మొలకెత్తిన గింజలు. మెులకెత్తిన గింజలు తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచచ్చు. వాటిలో ఉండే విటమిన్లు,ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పచ్చి శెనగలు, పెసర్లు, గింజలు, పప్పుధాన్యాలు, సోయాబీన్స్, బార్లీ, క్వినోవా తదితరాలను మొలకల ఆహారంగా తీసుకోవచ్చు. మరి మెులకెత్తిన గింజల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి?
మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి విటమిన్ కె లాంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అలాగే వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాల సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన గింజలలో ఉండే ప్రోటీను నిల్వలు సులభంగా జీర్ణమవుతాయి. వీటి వల్ల పోషకాలను శరీరం సులభంగా గ్రహించేలా చేస్తుంది.
మొలకెత్తిన గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాటిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చూసి ఆకలి తొందరగా కలగకుండా చేస్తుంది. వేరుశనగ మొలకలు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్న వారిలో కొవ్వును తగ్గించేస్తుంది.
మొలకెత్తిన గింజలు శరీరాన్ని శుధ్ది చేస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరం చైతన్యమై నిత్యయవ్వనంగా కనిపిస్తారు. మొలకల్లో జింక్, ఇనుము, క్యాల్షియం వంటివి అధికంగా ఉండి ప్రాణ వాయువును అన్ని శరీర భాగాలకి చేరేందుకు మొలకల్లోని పోషకాలు సహకరిస్తాయి.
- మొలకెత్తిన గింజల్లో పీచు పుష్కలంగా లభిస్తుంది. అది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
- మొలకల వల్ల అజీర్తి సమస్య దూరం అవుతుంది.
- మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను దూరం చేస్తుంది.
- మొలకల్లో పది నుంచి వంద రెట్లు ఎక్కువగా గ్లుకోరాఫనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
- వీటిలో విటమిన్-D, ఎంజైములు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియలు వేగంగా జరిగేందుకు సహకరిస్తాయి.