రావణాసురుడు రాముడి చేతనే ఎందుకు చంపబడ్డాడు ? అసలు అయన పొందిన వరం ఏంటి?

రావణాసురుడు దేవతలని సైతం భయపెట్టే అతి భయంకరుడు. ఈ లంకాధిపతి గొప్ప శివభక్తుడు కూడా అయితే కఠోర తప్పసుతో వరం పొందిన రావణాసురుడు రాముడి చేతనే ఎందుకు చంపబడ్డాడు. అసలు అయన పొందిన వరం ఏంటి? రావణ సంహారం కోసం దేవతలు ఎవరు ఎవరిని ఏవిధంగా జన్మించేలా చేసారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ravanasuruduదశరథుని పుత్రకామేష్ఠియాగంలో తమ హవిర్భాగాలు స్వీకరించేందుకు దేవ గంధర్వ సిద్ధులూ, మహర్షులూ బయల్దేరుతూ, దివ్యలోకంలో పరమేష్ఠితో సమావేశమయ్యారు. లంకాధీశ్వరుడు రావణుని గురించి చెప్పి, అతన్ని సంహరించే మార్గం ఆలోచించమన్నారు. ఎందుకంటే సురాసుర, యక్ష, కిన్నర, గంధర్వాదులచే మరణం లేకుండా రావణుడు బ్రహ్మ వరాన్ని పొందుతాడు. కానీ అల్పులని భావించి నర, వానరులని ఉపేక్షిస్తాడు. దానినే అవకాశంగా తీసుకొని బ్రహ్మ. నరుని చేతే రావణుణ్ణి సంహరించేందుకు ఇదే సరైన మార్గం అని భావిస్తాడు.

Yaggnamఇది ఇలా ఉంటె సంతతికోసం దశరథుడు యజ్ఞం చేస్తుంటాడు. ఆ ఇంట మానవునిగా మాధవుణ్ణి జన్మించమని వేడుకుందాం అని పరమాత్ముని కోసం ధ్యానం చేయండని బ్రహ్మసహా అక్కడ ఉన్న దేవతలంతా ధ్యానించసాగారు. కాస్సేపటికి సర్వజ్ఞుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నుడై ఇలా పలికాడు వారితో.మీ అభీష్టాన్ని అనుసరించి దుష్టరావణుణ్ణి పుత్ర బంధు బలగాల సహా హతమారుస్తాను. లోక రక్షణకోసం సత్యసంధుడైన దశరథునికి నా తేజ స్సుతో నలుగురు కుమారులుగా అవతరిస్తాను. మీరూ తగు సన్నాహాలు చెయ్యండి. నిర్భయంగా ఉండండి అని అభయం ఇచ్చాడు నారాయణుడు.

Sri Ramఅప్పుడు బ్రహ్మ మనం కూడా కొన్ని చేయాల్సినవి ఉన్నాయని దేవతలకి చెబుతాడు. గతంలో నేను ఆవలిస్తే మహాపరాక్రమ వంతుడు ఎలుగుబంటు వీరుడు జాంబ వంతుడు జన్మించాడు. మీరు కూడా మీమీ అంశ లతో బలిష్టులైన ఋక్ష, వానర వీరులను భూమిపై అసంఖ్యాకంగా సృష్టించండి అంటూ బ్రహ్మ దేవతలకి చెప్బుతాడు.  దశరథుని క్రతువులో హవి ర్భాగాలు స్వీకరించేందుకు అక్కణ్ణుంచి బయ ల్దేరారు.భక్తి శ్రద్ధలతో పవిత్రాహుతులు హోమ గుండంలో వేలుస్తున్నాడు దశరథుడు. మంత్రో చ్చారణ జరుగుతోంది. మంట మహా రూపు దాల్చి పరాక్రమంతుడయిన ఒక వేల్పు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో సువర్ణపాత్ర ఉంది. దశరథుణ్ణి ప్రసన్నంగా చూశాడతను. అప్పుడు అయన దశరథా! నీ యజ్ఞం సఫలమైంది. నేను ప్రజాపతిని! నీ కోరిక తీర్చేందుకు దేవతలు అందజేసిన దివ్యపాయసాన్ని తీసుకుని వచ్చా  స్వీకరించు. దీనివల్ల మహాతేజోవంతు లయిన నలుగురు కుమారులు నీకు జన్మిస్తారు. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు అని చెప్పి ఆ పాయసాన్ని అందిస్తాడు.

Sri Ramఅప్పుడు అందులో సగభాగాన్ని కౌసల్యకు అందజేశాడు.మిగిలిన దానిలో సగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. ఇంకా మిగిలిన దానిలో సగాన్ని కైకకు ఇచ్చి, శేషభాగాన్ని చూశాడు. ఆలోచించాడు. ఆ శేషాన్ని తిరిగి సుమిత్రకు అందజేశాడు. పాయ సాన్ని ఆరగించిన కౌసల్య, సుమిత్ర, కైకలు గర్భ వతుయ్యారు. దశరథుడు దీక్ష విరమించాడు. భార్యలతో నగరానికి చేరుకున్నాడు. పిల్లలకోసం నిరీక్షించసాగాడు. బ్రహ్మసంకల్పంతో రామునికి సహాయంగా ఉండేందుకు ఇంద్రునివల్ల వాలి, సూర్యునివల్ల సుగ్రీవుడు, ఈ ఇద్దరూ వానరరాజు ఋక్షరజునికి కుమారులుగా జన్మించారు. అయితే వాయువు అంశతో కేసరి భార్య అంజనీదేవికి వజ్రశరీరంతో, వాయువేగాలతో ఆంజనేయుడు జన్మించాడు. ఇంకా బృహస్పతి అంశతో తారుడు, వరుణునకు సుషేణుడు, అగ్నికి నీలుడు, విశ్వకర్మకు నలుడు, అశ్వినీదేవతలకు మైంద ద్వివిదులు వానరులుగా జన్మించారు. వీరేగాక ఇంకా దేవతల అంశతో యక్ష, కిన్నర, గంధర్వకాంతలకు మహావీరులైన ఋక్ష, వానరులు జన్మించి, కొండలూ, కోనల్లో పెరగసాగారు.

Sri Ramuduఈవిధంగా రావణ సంహారానికి నారాయణడు శ్రీ రాముడిగా మనిషి అవతారం ఎత్తగా, దేవతల అనుగ్రహంతో వానర సైన్యం జన్మించి చివరకు రావణ సంహారం జరిగింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR