కాశీలో చనిపోయిన వారి కుడి చెవి పైకి ఉంటుంది ఎందుకో తెలుసా?

కాశీ పుణ్యక్షేత్రం గురించి దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ స్థల మహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో..? సముద్రంలో నీటి బిందువు లాంటి ఈ సంక్షిప్త సమాచారం తెలియజేయడం జరుగుతుంది. హిందువులు జీవితంలో ఒక్క సారైనా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించి తీరాలి. ఈ క్షేత్ర దర్శనం వల్ల బ్యాహా సౌందర్యం దృశ్యాల కంటే కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపానం అవుతుంది. చిత్త శుద్ధితో ఎవరైతే ఈ స్థలాన్ని దర్శిస్తారో వారిలోపల అనేక మార్పులు కలిగి , ఆత్మా జ్ఞానం కలిగిస్తుంది.
  • ఈ విధంగా కాశీలో ఉన్న ఆ గంగా నదిలో స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల ఏడు జన్మల పాపాలు సైతం తొలగిపోతాయని భావిస్తారు. అదేవిధంగా కాశీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా మరణించిన కాశీలో దహనసంస్కారాలు చేయటంవల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని చాలా మంది భావిస్తారు.
  • కాశీలో శవాలను దహనం చేయడానికి ప్రత్యేకమైన ఘాట్ ఉంది. కాశీలో మరణించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుందని చెబుతారు. ఈ కాశీ ప్రాంతంలో ఏ జీవి మరణించిన ఆ జీవి కుడి చెవి పైకి ఉంటుంది.
  • ఆ విధంగా మరణించిన వారి కుడి చెవిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తారక మంత్రం ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని భావిస్తారు. అదేవిధంగా చుట్టుపక్కల ఎక్కడ మరణించిన వారికి దహన సంస్కరణలు కాశీ ఘాట్ లోనే నిర్వహిస్తారు. ఇక్కడ శవాలకు దహన సంస్కారాలు చేసిన బూడిదతోనే ఆ పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు.
  • కాశీలో ఉన్నటువంటి ఘట్టాల విషయానికి వస్తే గంగా నది తీరాన 64 ఘట్టాలు ఉన్నాయి. వీటన్నింటిలో కెల్లా అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టాన్ని మణికర్ణికా ఘట్టము అని పిలుస్తారు. కాశి చేరుకున్న యాత్రికులు ఈ ఘట్టం లోనే స్నానాలు ఆచరించి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు. అదేవిధంగా ఈ ఘాట్ లోనే ఎల్లప్పుడు శవాలను దహనం చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో మహావిష్ణవు తన చక్రముతో ఒక తీర్థాన్ని త్రవ్వి, దాని తీరంలో శ్రీ విశ్వనాధుని గురించి తపస్సు చేసాడు.
  • శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తీర్థాన్ని చూసి విఘ్ణ దేవుని తపస్సుకు మెచ్చుకొని అక్కడ విశ్వేశ్వరునిగా వెలిసాడు. ఈ విధంగా శివుడు ప్రత్యేక్షమైన సమయంలో శివుని కుడి చెవికి ఉండే మణి కుండలం జారీ ఆ తీర్థంలో పడటం వల్ల ఆ తీర్థాన్ని చక్రతీర్థం అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ మణికర్ణికా ఘాట్ లో ప్రతిరోజు భారీ సంఖ్యలో శవాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR