Home Health కొబ్బరి నూనెను మనం ఆహారంలో ఎందుకు తీసుకోవాలో తెలుసా ?

కొబ్బరి నూనెను మనం ఆహారంలో ఎందుకు తీసుకోవాలో తెలుసా ?

0

మనం కొబ్బరి నూనెను తలకు మాత్రమే రాసుకుంటాం. కానీ, కేరళ ప్రజలు వంటల్లో కూడా కొబ్బరినూనెనే వాడతారు. కేరళ తరహాలోనే మనకు కూడా బోలెడన్ని కొబ్బరి తోటలు ఉన్నాయి. కోనసీమలో అడుగు పెడితే అడుగుకో కొబ్బరి చెట్టు ఉంటుంది. అయినా సరే.. మనం కొబ్బరి నూనెను ఇంకా తలకు వాడే తైలంగానే భావిస్తున్నాం. కొబ్బరి నీళ్ల నుంచి నూనె వరకు ప్రతి ఒక్కటీ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ కరోనా సీజన్లో కేరళ ప్రజలు త్వరగా వైరస్ నుంచి కోలుకోడానికి ఈ కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతోందని తాజా పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో కొబ్బరి నూనెను మనం ఆహారంలో ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం. అలాగే అందాన్ని పెంపొందించడంలో కొబ్బరి ఎలాంటి పాత్రను పోషిస్తుందనేది కూడా చూద్దాం.

Health Benefits of coconut Oilకొబ్బరి నూనె మనకి అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, దాని ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. అది ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం కలపడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. చర్మం, జుట్టుకి ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. కర్పూరం గురించి మనం చెప్పుకోవాలంటే, దానిని అనేక విధాలుగా వాడొచ్చు. దాని నుంచి తయారైన నూనె శరీర నొప్పిని తగ్గించడంలో, చర్మ రోగాలను నయం చేయడంలో, మచ్చల్ని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కొబ్బరి నూనెలో అధికంగా సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. దీనిలో దాదాపు 50% లారిక్ ఆసిడ్ ఉంటుంది. ఈ లారిక్ ఆసిడ్ మంచి కొలెస్టెరాల్ స్థాయిలు పెరగడానికి బాధ్యత వహిస్తుందని భావింపబడుతుంది. మంచి కొలెస్టెరాల్ గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయం చేస్తుంది.

కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే లారిక్ ఆసిడ్ ఆకలిని తగ్గించడంలో బాధ్యత వహిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే గ్లిసెరాల్ మోనోలారెట్ మరియు లారిక్ ఆసిడ్లు కొన్ని రకాల బాక్టీరియాలపై ప్రభావంతమైన యాంటీమైక్రోబియల్ చర్యలు చూపుతాయని అధ్యయనాలు సూచించాయి. అలాగే శుద్ధి చెయ్యని కొబ్బరి నూనె కాండిడా వంటి ఫంగస్ పై వ్యతిరేక చర్యలను చూపుతుందని మరొక అధ్యయనం తెలిపింది.

కొబ్బరి నూనె మంచి ‘మాయిశ్చరైజర్’ గా పనిచేస్తుంది మరియు దీనిని ఉపయోగించడం ద్వారా చర్మం పొడిబారిపోవడం లేదా జిరోసిస్ మరియు అటోపిక్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.

కొబ్బరి నునె జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని నిర్దారించబడింది. దీని జుట్టు రాలడం పై వ్యతిరేకంగా పోరాడుతుంది, అంతేకాక జుట్టు ప్రోటీన్ల నష్టాన్ని తగ్గించి అధికంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

కొబ్బరి నూనెలో అధికంగా ఉండే లారిక్ ఆసిడ్ ఒక మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్ (ఎంసిటి). ఈ ఎంసిటి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వలన అల్జీమర్స్ వ్యాధి ఉన్న రోగులలో మెదడు పనితీరు మెరుగు పడిందని తద్వారా అల్జీమర్స్ లక్షణాలు తగ్గాయని ఓక అధ్యయనం తెలిపింది.

ఆయిల్ పుల్లింగ్ ఒక పురాతన ఆయుర్వేద ప్రక్రియ, దీనిని చేయడం వలన నోటి ఆరోగ్యం మెరుగుపడుతుందని మరియు దంత సమస్యలు తగ్గుతాయని భావిస్తారు . అధ్యయనాలు ఆయిల్ పుల్లింగ్ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించడం వలన ఫలితాలు చర్మం సమర్థవంతంగా ఉంటాయని సూచిస్తున్నాయి.

 

Exit mobile version