కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

0
283

బాగా సంపాదిస్తే కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు అని చెబుతూ ఉంటారు. అంటే రిలాక్స్ అయ్యే సమయంలో అలా కూర్చుంటూ ఉంటారు. ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్నప్పుడు చాలా మందిన ఒక కాలుపై మరొక కాలు వేసి అంటే క్రాస్ లెగ్ వేసి కూర్చోవడం చూస్తుంటాము. ఇలా కూర్చోవడం చాలా స్టైలిష్‌గా, ఎంతో హుందాగా, మరింత సుఖంగా కూడా ఉంటుంది. కానీ ఇలా కూర్చోవడం వల్ల హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

cross-legged cause health problemsఇలా కూర్చోవడం వల్ల రక్తపోటు పెరగడం లాంటి అనేక సమస్యలకు దారి తీస్తుందిని మనలో చాలామందికి తెలియదు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువసేపు క్రాస్ లెగ్ పోజులో కూర్చుంటే, నరాలపై ఒత్తిడి పెరిగి రక్తపోటు పెరుగుతుందని తమ అధ్యయనాల్లో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు సమస్యలు లేనివారు కూడా ఈ భంగిమలో ఎక్కువసేపు కూర్చోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

cross-legged cause health problemsఎక్కువ కాలం క్రాస్-లెగ్ పోజులో కూర్చోకూడదు అనడానికి మరొక కారణం పక్షవాతం లేదా పెరోనియల్ నరాల పక్షవాతం. అలా ఎక్కువ కాలం పాటు ఈ పోజులో కూర్చునే అలవాటు వల్ల నరాలు అణిగిపోయి దెబ్బతింటాయి. ఫలితంగా నరాల పక్షవాతానికి దారితీస్తాయి.

cross-legged cause health problemsఒక కాలు మీద మరొకాలు వేసినపుడు గుండె నుండి పాదాల వరకు రక్త ప్రసరణ సాఫీగా జరగకపోవడం వల్ల కాళ్లలో ఒక రకమైన మంటగా అనిపిస్తుంది. అలాగే నరాలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. వీటితో పాటు పెల్విక్ సమస్యలకు కూడా దారితీస్తాయి. ఇంకొంత మందిలో మోకాళ్ల నొప్పుల సమస్యలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఇవన్ని సమస్యలకు చెక్ పెట్టాలాంటే ఏ స్థితిలో కూర్చున్నా కూడా, ఎక్కువసేపు ఒకే స్థానంలో కూర్చోకుండా మధ్య మధ్యలో భంగిమలు మారుస్తూ ఉండాలి.

 

SHARE