తులసి మొక్క మంచి, చెడును ముందే సూచిస్తుందా?

ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు. రోజూ తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయుల కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  •  ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ తులసి మొక్కకు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ తులసి మొక్కను దైవ సమానంగా భావిస్తారు.
  • ఆరోగ్యపరంగా కూడా తులసి ఎంతో ముఖ్యమైనది. పూర్వ కాలం నుంచి ఈ తులసి మొక్కను ఎన్నో ఆయుర్వేద మూలికలలో ఉపయోగిస్తున్నారు. ఎంతో పరమపవిత్రంగా భావించే ఈ తులసి మొక్కను ఉపయోగించాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
  • కానీ నియమాలకు విరుద్ధంగా పాటించటం వల్ల మనకు బాధలు తప్పవని పండితులు తెలియజేస్తున్నారు. అయితే తులసి మొక్కను ఏ విధంగా ఉపయోగించకూడదో తెలుసుకుందాం…
  • ఇంటి ముందు తులసి కోటకు ప్రతి రోజు పూజ చేయటం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని భావిస్తారు. అయితే ఈ తులసి ఆకులతో పొరపాటున కూడా పరమేశ్వరుడికి పూజ చేయకూడదు. ఈ విధంగా తులసి ఆకులతో శివుడికి పూజ చేస్తే తులసి మాత ఆగ్రహానికి గురికావడం వల్ల ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
  • జలంధరుడు అనే రాక్షసుడు తులసి మాత భర్త. జలంధరుడు చనిపోవడానికి కారణం శివుడు కావడంతో ఎంతో ఆగ్రహానికి గురైన తులసి తన మాలతో ఆ పరమశివుని పూజించకూడదని శాపం పెడుతుంది. అదేవిధంగా తులసి మాలతో వినాయకుడిని కూడా పూజించకూడదు.
  • అదేవిధంగా పండుగలు, ప్రత్యేకమైన రోజులలో తులసి ఆకులను తుంచకూడదు. ఆదివారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య రోజులలో తులసి ఆకులను తుంచకూడడని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా తులసి మొక్కను ఎప్పుడు కూడా ఇంటి ఆవరణంలోని ఉంచుకోవాలి.
  • పొరపాటున ఇంటిలోపల ఉంచుకోకూడదు. తులసి కోటకు ఎల్లప్పుడు నియమనిష్టలతో పూజ చేయటం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి అనుగ్రహించి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయని భావిస్తారు. తులసి మొక్క ఏ ఇంటిలో అయితే ఎండిపోతుందో ఆ ఇంట్లో ఏదో చెడు జరుగుతుందని సంకేతం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR