కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కలిపి తాగితే….?

  • సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తాగే ద్రవాలలో కొబ్బరి నీళ్లు ఒకటి. శరీరం డీహైడ్రేట్ అవకుండా కావాల్సిన గ్లూకోస్ శాతాన్ని శరీరానికి అందిస్తుంది. కొబ్బరికాయలో 94 శాతం నీరు, చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. 250 మి.లీ కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, ఆర్డీఐ విటమిన్ సి 10 శాతం, ఆర్డీఐ మెగ్నీషియం 15 శాతం, ఆర్డీఐ మాంగనీస్ 17 శాతం, ఆర్డీఐ పొటాషియం 17 శాతం ఉన్నాయి. ఆర్‌డిఐ సోడియంలో 11 శాతం, ఆర్‌డిఐ కాల్షియంలో 6 శాతం ఉంటాయి.
1
  • ఇక కొబ్బరి నీళ్లు అందుబాటులో లేకపోతే అంత గొప్ప పానీయం నిమ్మరసం అనుకోవాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం చాలామంది విడివిడిగా తాగుతుంటారు. కానీ కొబ్బనినీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఏం జరుగుతుందో తెలిస్తే రోజూ అలానే తాగుతారు.  కొబ్బరి నీళ్లు-నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్‌లో సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు ఉంటాయి.
  • కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగాను, కొవ్వులు అసలే ఉండవు. చక్కెర తక్కువగాను, పొటాషియం ఎక్కువగాను ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి కొబ్బరి నీళ్ళలో కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. కొబ్బరి నీళ్ళూ, నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. శరీరంలో, కాలేయంలో ట్యాక్సిన్స్ తొలగించడంలో ఈ రెండూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. జీర్ణ శక్తిని పెంచే గుణాలు కొబ్బరినీళ్లలో, నిమ్మరసంలో మెండుగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు మాయం అవుతాయి.
2
  • కొబ్బరి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల సమర్థమైన టానిక్‌లా పనిచేస్తుంది. డీహైడ్రేషన్ కు గురైన వారు కొబ్బరినీళ్ళలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎక్కువ ఉపయోగకరం. ఇది తక్షణ ఎనర్జీని ఇస్తుంది. కొబ్బరినీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంటుంది. ఇది అపరిమిత సంఖ్యలో ఉండే అల్బుమిన్, నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ రెండు కలవడం వల్ల మూత్రపిండ సంబంధిత వ్యాధులు, మూత్ర విసర్జనలోని లోపాలు, కిడ్నీలోని రాళ్ళు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
  • కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది. నిమ్మరసం కలపడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జీర్ణ శక్తిని పెంచే గుణాలు కోకోనట్ వాటర్ మరియు నిమ్మరసంలో మెండుగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు మాయం అవుతాయి.
  • కడుపులో ప్రేగు నుంచి హానికరమైన బాక్టీరియాలను తొలగిస్తుంది. కొబ్బరి నీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంటాయి. నిమ్మరసం మితంగా కలిపి తాగడం వల్ల స్టొమక్ అల్సర్ వంటి లక్షణాలు త్వరగా నివారించుకోవచ్చు. వాంతుల దశలో ఉన్న గర్భిణీలకు ఈ డ్రింక్ ఇస్తే ఫలితం కనిపిస్తుంది. తరుచూ వాంతులు చేసుకునే పిల్లలకు ఇది పరమఔషధంలా పనికొస్తుంది.
3
  • ముఖంలో నల్ల మచ్చలు, మొటిమలను ఎఫెక్టివ్‌గా తగ్గించే లక్షణాలు కొబ్బరి నీళ్ళు, నిమ్మరసంలో అధికంగా ఉన్నాయి. ఆస్త్మాను తగ్గించడంతో పాటు, అధిక బరువుకు కళ్లెం వేస్తుంది. సహజంగా బరువు తగ్గించుకోవడానికి లెమన్ వాటర్ విత్ హనీ తీసుకుంటుంటారు. అంత కంటే మరింత ఎఫెక్టివ్ గా బరువు తగ్గించడానికి కోకనట్ వాటర్ విత్ లెమన్ కూడా గ్రేట్ గా బరువు తగ్గిస్తుంది. అదే సమయంలో శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది.
5
  • అదే విధంగా.. కొబ్బరి నీటిలో గ్లూకోజ్ కలుపుకుని తాగడం వల్ల అలసట, నీరసం తగ్గిపోతంది. ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీ రాళ్ల సమస్య దూరం అవుతుంది. అదే విధంగా గుండె సంబంధిత సమ్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, మూత్ర పిండ సమస్యలు దూరం అవుతాయి. సూర్య రశ్మికి ఎక్కువగా తిరిగితే త్వరగా డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అలాంటి టైమ్‌లో ఈ కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల సమస్యలు దూరం అవుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR