Home Health మీగడ పేరుకుపోయిన టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

మీగడ పేరుకుపోయిన టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

0

ఉదయాన్నే వేడి వేడిగా ఒక టీ తాగనిదే చాల మందికి రోజు మొదలవదు. ఏ కాలంలోనైనా వేడి వేడిగా ఉండే టీ అలా నెమ్మ‌దిగా గొంతులోకి దిగుతుంటే వ‌చ్చే మ‌జాయే వేరు క‌దా. ముఖ్యంగా చ‌లికాలంలోనైతే టీ ఇచ్చే ఉత్తేజ‌మే వేరు. నీర‌సంగా, మ‌బ్బుగా ఉన్న‌వారు కూడా టీ తాగితే ఉత్తేజం పొంది ఉత్సాహంగా ప‌నిచేస్తారు.

Teaకాకపోతే టీ తాగే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మనం టీ తాగేటప్పుడు దానిపై మీగడ రావడం చూస్తూనే ఉంటాం. మరి అలా మీగ‌డ పేరుకుపోయిన టీ తాగితే మంచిదా, కాదా అని ఎప్పుడైనా ఆలోచించారా.. మ‌రి దాని గురించి తెలుసుకుందామా.

సాధార‌ణంగా టీ మీద మీగ‌డ పేరుకుపోవ‌డ‌మ‌నేది అందులో క‌లిపే పాల వ‌ల్ల వ‌స్తుంది. పాల‌ను కొద్దిగా వేడి చేసిన‌ప్పుడు అందులో ఉండే తేలిక‌పాటి కొవ్వులు దాని మీద పొర‌లా వ‌చ్చి మీగ‌డ‌లా పేరుకుంటాయి. ఈ క్ర‌మంలో ఆ పాల‌తో టీ పెడితే ఆ టీ పై కూడ మీగ‌డ పొర‌లా వ‌స్తుంది. దీర్ఘ కాలికంగా అలా తాగితే మాత్రం కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

మీగ‌డలో పాల‌క‌న్నా దాదాపుగా 20 నుంచి 36 శాతం వ‌ర‌కు అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్‌, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి నిత్యం ఎంతో కొంత అవ‌స‌ర‌మే. అయితే అవి మోతాదుకు మించితే మాత్రం రక్త నాళాల్లో పేరుకుపోతాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. త‌ద్వారా దీర్ఘ‌కాలికంగా ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

క‌నుక టీ తాగే వారు మీగ‌డ‌ను తీసేసి తాగితేనే మంచిది. అయితే అది మోతాదుకు త‌క్కువైతే మాత్రం మీగ‌డ ఉన్నా ఏమీ కాదు. అది ఎక్కువైతేనే స‌మ‌స్య‌. మ‌రి ఎంత మోతాదు వ‌ర‌కు ఆ ఫ్యాట్స్‌ను మ‌నం తీసుకోవ‌చ్చు అంటే రోజుకు 2 గ్రాముల వ‌ర‌కు వాటిని తిన‌వ‌చ్చు. అంత‌కు మాత్రం మించ‌కూడ‌దు.

Exit mobile version